లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ప్రపంచవ్యాప్తంగా కోటికి చేరువలో కరోనా వైరస్ కేసులు

చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మనుగడను

Published

on

corona virus cases very near to one crore

చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మనుగడను

చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మనుగడను సవాల్ చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. ఇంకా ఎంతమందిని పొట్టనపెట్టుకుంటుందో తెలీదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువైంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 95లక్షల 26వేల 495కి చేరింది. గత 24 గంటల్లో ఈ వైరస్‌ వల్ల 5వేలకు మందిపైగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4లక్షల 84వేల 960కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 51లక్షల 75వేల 319 మంది కోలుకున్నారు. 38లక్షల 7వేల 790 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

24లక్షల కేసులు, లక్షా 24వేల మరణాలతో టాప్ లో అమెరికా:
కాగా, ఇప్పటివరకు అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 39 వేల కొత్తకేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 41 వేల కేసులు రికార్డయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 24లక్షల 62వేల 554 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లక్షా 24వేల 281 మంది కరోనాతో చనిపోయారు. 10లక్షల 40వేల 605 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12లక్షల 97వేల 668 మంది చికిత్స పొందుతున్నారు. 

రెండో స్థానంలో బ్రెజిల్:
అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో తాజాగా 41వేల పైచిలుకు కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 11లక్షల 92వేల 474కు చేరింది. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 53వేల 874 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 88వేల 692కి పెరిగింది. రష్యా 6లక్షల 6వేల 881 పాజిటివ్‌ కేసులతో మూడో స్థానంలో కంటిన్యూ అవుతోంది. రష్యాలో ఇప్పటివరకు 8వేల 513 మంది కరోనాతో చనిపోయారు.

భారత్ ను భయపెడుతున్న కరోనా:
గత వారం రోజులుగా ప్రతి రోజు 14 వేల పైచిలుకు పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల 72వేల 985కు చేరింది. 2లక్షల 71వేల 688 మంది బాధితులు కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 86వేల 390. కరోనాతో మన దేశంలో 14వేల 907 మంది మరణించారు. 

* యూకేలో ఇప్పటివరకు 3,06,862 పాజిటివ్‌ కేసులు, 43081 మరణాలు. 
* స్పెయిన్‌లో 2,94,166 పాజిటివ్‌ కేసులు, 28,327 మరణాలు. 
* పెరులో 2,64,689 పాజిటివ్‌ కేసులు, 8586 మరణాలు.
* అత్యధిక కరోనా కేసుల జాబితాలో 8వ స్థానంలో ఉన్న చిలీలో 2,54,416 కరోనా కేసులు, 4731 మరణాలు.
* ఇటలీలో 2,39,410 పాజిటివ్‌ కేసులు.. 34,644 మరణాలు. 
* పదో స్థానంలో ఉన్న ఇరాన్‌లో 2,12,501 కరోనా కేసులు.. 9996 మరణాలు
* పాకిస్థాన్‌లో గత 24 గంటల్లో 3892 కరోనా కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,88,926కే చేరింది. 
* పాక్ లో కరోనాతో 3755 మంది మరణించారు. 
* బంగ్లాదేశ్‌లో నిన్న 1,582 పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు, 37 మంది మరణించారు. 
* బంగ్లాదేశ్ లో కరోనా కేసులు 1,22,660కి చేరగా, మృతుల సంఖ్య 1582కి పెరిగింది.

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు:
మొత్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రజలు ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు స్పష్టం చేశారు. దీంతో సమస్త మానవాళి కరోనా వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. కాగా, త్వరలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని పలు దేశాలు ప్రకటిచాయి. ప్రస్తుతం ట్రయల్స్ లో ఉన్నాయి.

Read: అమెరికాలో అక్టోబర్ నాటికి లక్షా 80వేల మంది కరోనాతో చనిపోతారు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *