ప్రియుడితో కలిసి భర్తను చంపి కరోనాతో చచ్చిపోయాడని భార్య డ్రామాలు : మహమ్మారి పేరుతో దారుణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనాను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారుల గురించివిన్నాం. కరోనా పేరుతో మోసాలకు పాల్పడే కేటుగాళ్ల గురించి కూడా విన్నాం. కానీ కరోనా పేరుతో ఏకంగా భర్తనే చంపేసి భార్య దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారిని ఇలా కూడా వాడేసుకోవచ్చని నిరూపించింది ఓ భార్య.

వివరాల్లోకి వెళితే..ఒడిశాకు చెందిన శరత్ ‌దాస్‌ (45), అనిత దాస్‌(35)లు భార్యాభర్తలు. వీరికి పెళ్లి అయి 15 సంవత్సరాలైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి నోయిడాకు వచ్చి స్థిరపడ్డారు. ఇద్దరూ కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో అనితకు అదే ప్రాంతంలో ఉంటున్న సంజయ్‌(32)తో పరిచం అయ్యింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది.

తప్పు ఎన్నాళ్లో దాగదుకదా..వీరి సంబంధం గురించి శరత్ కు తెలిసింది. భార్యను నిలదీసాడు. ఇక ఇటువంటి పిచ్చి వేషాలు వేయకు అని హెచ్చరించాడు. అయినా అని వినలేదు. సంజయ్ ని కలవడం మానలేదు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఈ బజారు పనులేంటని భార్యతో గొడవపడేవాడు శరత్.

దీంతో కామంతో కళ్లు మూసుకుపోయిన అనిత కుటుంబం విలువ తెలీక భర్త శరత్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. అదే మాట ప్రియుడు సంజయ్‌తో చెప్పింది. ఎవరికి అనుమానం రాకుండా మంచి ప్లాన్ వేశారు. కరోనా వైరస్ దారుణంగా ఉన్న సమయాన్ని వాడుకోవాలనుకున్నారు.
దీంట్లో భాగంగా మే 1 రాత్రి శరత్ గాఢ నిద్రలో ఉండగా అనిత, సంజయ్ కలిసి దుప్పటితో శరత్ ముఖాన్ని కప్పి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తరువాత ఏమీ తెలియనట్లుగా అనిత తెల్లరాగానే ఏడుపు మొదలుపెట్టింది. అనిత ఏడుపులు విన్ చుట్టుపక్కల వారు అనిత దగ్గరకొచ్చి ఏం జరిగిందని అడిగారు.
కరోనా వైరస్ సోకి నా బర్త చనిపోయాడని భోరున ఏడుస్తూ చెప్పింది. అనిత గురించి తెలిసిన ఇరుగుపొరుగు వారితో పాటు శరత్ బంధువులు కడా అనుమానించారు. రాత్రి వరకూ ఆరోగ్యంగా తిరిగిన వ్యక్తి తెల్లారేసరికి ఎలా చనిపోతాడని శరత్ మృతి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అనితను పిలిచి ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అనుమానం వచ్చిన పోలీసులు శరత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు. అనంతరం మే 4న ఆవ్యక్తి పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా నిర్ధారణ అయ్యింది.దీంతో పోలీసులు అనితను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి తానే సంజయ్‌తో కలిసి హత్య చేసినట్లు నేరం ఒప్పుకుంది.

Related Posts