ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. వారంలోనే మూడున్నర లక్షల కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్‌లో వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చి.. దేశ ప్రజలను భయంతో వణికిస్తోంది. కొద్దిరోజులుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 21న్నర లక్షల మందికి వైరస్‌ సోకితే కేవలం ఈ ఒక్క వారంలోనే 3.5 లక్షల మంది మహమ్మారి ధాటికి అతలాకుతలం అవుతున్నారు. వీరిలో ఇప్పటికే 5వేల 244 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఆరోగ్య శాఖ డ్యాష్‌బోర్డు వివరాల ప్రకారం.. దేశంలో ఆదివారం వరకూ 21లక్షల 53వేల 10 మందికి కరోనా సోకింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 64వేల 399 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ 24గంటల వ్యవధిలో 861 మంది మృతిచెందారు. వరుసగా మూడు రోజులుగా దేశంలో 60 వేల కేసులు దాటుతున్నాయి. ఆదివారం 64వేల 399 కేసులు నమోదవగా, శనివారం 61వేల 537 కేసులు, శుక్రవారం 62వేల 538 కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే కోలుకున్న వారి సంఖ్య 14.8 లక్షలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 68.78 శాతంగా ఉందన్నమాట. గడిచిన 24 గంటల్లో 53వేల 877 మంది కోలుకున్నట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం దేశం మొత్తంలో 6లక్షల 28వేల 747 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 43వేల 379 మంది మృతిచెందినట్లు తెలిపింది.‘నెల రోజులుగా కొవిడ్‌-19 రికవరీ రేటు 48.20 శాతం నుంచి 68.32 శాతానికి పెరిగింది. మెరుగైన చికిత్స అందించడం వల్లనే రికవరీ రేటు పెరిగి మృతుల సంఖ్య తగ్గింది’ అని ఆరోగ్య శాఖ ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

Related Posts