కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదు..దానికదే అంతమైపోతుంది : ఆక్స్‌ఫర్డ్‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ ను ఖతం చేయటానికి ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. కానీ కరోనా వైరస్‌ దానికదే అంతమవుతుందని..సహజంగా కరోనా వైరస్ అంతం అవుతుందని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సునేత్ర గుప్తా తెలిపారు. కరోనాను అంతం చేయటానికి వ్యాక్సిన్‌ అవసరం పెద్దగా ఉండబోదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.

కరోనాను నియంత్రించటానికి లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదని ఆమె అన్నారు.ఇన్‌ఫ్లూఎంజా మాదిరిగానే కరోనా కూడా మన జీవితంలో ఒక భాగమవుతుందని..ఇది సహజంగానే అంతమవుతుందని ఎపిడెమియాలజిస్ట్ అయిన సునేత్ర అన్నారు. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా కరోనా బారినపడ్డారని..ఇదిప్రపంచ వ్యాప్తంగాజరిగిందనీ..కాబట్టి మిగతావారు కరోనా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ వారి వారి పనులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఆరోగ్యవంతులు ఈ కరోనా వైరస్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అయితే కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసిన ఆమె..వచ్చిన తరువాత కూడా ఈ కరోనా వ్యాక్సిన్‌ అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదని..ఎవరైతే వైరస్‌కు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశమున్నదో వారికి మాత్రమే ఈ వ్యాక్సిన ఉపయోగపడుతుందని సునేత్ర చెప్పారు.

ఆరోగ్య రంగం ప్రమేయం లేకుండా కేవలం లాక్‌డౌన్‌ వైరస్‌ వ్యాప్తిని కొంత వరకు కరోనాను నియంత్రించవచ్చు గానీ ఇదే శాశ్వత పరిష్కారం కాదనీ సునేత్ర గుప్తా అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్‌తో కరోనాను పూర్తిగా నియంత్రించినట్లు చెప్పుకొంటున్న న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో రెండో విడత కరోనా వైరస్‌ పంజా విసురుతున్నదనే విషయాన్ని ఈ సందర్బంగా సునేత్ర గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే లాక్‌డౌన్‌ను వ్యతిరేకించే సునేత్ర గుప్తాను ‘రీఓపెన్‌ ప్రొఫెసర్‌’గా వ్యవహరిస్తుంటారు. ఏమాట అయినా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమెకు అలవాటనే పేరుంది సునేత్ర గుప్తాకు.

Read:కుక్కలకంటే హీనంగా : కరోనాతో బాధిత మృతదేహాన్ని ఈడ్చుకెళుతూ..

Related Posts