లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కాకినాడలో కరోనా కలకలం…విదేశాల నుంచి వచ్చిన నలుగురు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.

Published

on

Corona virus tension in Kakinada

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇవాళ ఉదయం నలుగురు సభ్యుల కుటుంబం విదేశాల నుంచి వచ్చింది. ఆస్పత్రిలోని క్వారంటైన్ లో ఉండకుండా ఇంట్లోకి రావడంపై అపార్ట్ మెంట్ వాసుల అభ్యంతరం తెలిపారు. భయంతో కరోనా హెల్ప్ లైన్, స్థానిక గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. కరోనా హెల్ప్ లైన్, స్థానిక సిబ్బంది స్పందించలేదు. నలుగురిని ఆస్పత్రికి తరలించాలని అపార్ట్ మెంట్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. స్థానికులు ఆందోళనతో బాధితులను ఆస్పత్రికి తరలించారు. 

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7వ కేసు నమోదైంది. విశాఖకు చెందిన 25ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అతడు ఇటీవలే యూకే నుంచి విశాఖపట్నం వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతడి నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇప్పటివరకు విశాఖలో 3 పాజిటివ్ కేసులు నమోదు కావడం స్థానికుల్లో ఆందోళన నింపింది. ఇటీవలే మక్కా నుంచి వచ్చిన వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. అతడి భార్యకూ కరోనా సోకింది. ఇప్పుడు విశాఖలోనే మరో పాజిటివ్ కేసు నమోదైంది. 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానిక ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.  విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వారిని పూర్తి  పర్యవేక్షణలో ఉంచే విధంగా  అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.  విదేశాలనుంచి వచ్చిన వారిని పర్యవేక్షించటానికి  ప్రతి 10 మందికి ఒక అధికారిని నియమించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు సమీక్ష నిర్విహంచిన ఉన్నతాధికారుల ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.  

మండల స్థాయిలో కొంతమంది అధికారులను కొవిడ్‌-19 ప్రత్యేక అధికారులుగా నియమించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రతి రోజు వివరాల నమోదు, డేటా ఆధారంగా వైద్య శాఖ చర్యలు తీసుకోనుంది. కరోనావైరస్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆధ్వర్యంలో నలుగురు ఏఏఎస్‌ల బృందం ఏర్పాటు చేసింది. ఐఏఎస్‌ అధికారులు ప్రద్యుమ్న, గిరిజా శంకర్‌, కార్తికేయ మిశ్రా, కన్నబాబులను వైద్య ఆరోగ్య శాఖకు అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *