Coronavirus Andhra Pradesh 83 Fresh Cases

ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు : ఒక్కరోజే 83 కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా కేసుల ఉధృతి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నెల మొదటి రెండు వారాల పాటు చాలా తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు మళ్లీ పెరిగిపోయాయి. 2020, మే 24వ తేదీ ఆదివారం కూడా అధిక సంఖ్య కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 83మందికి వైరస్‌ సోకింది.

ఆదివారం 11 వేల 357 పరీక్షలు నిర్వహించగా 83 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 11 కేసులు కోయంబేడుకు సంబంధించినవి కాగా 17 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 37మంది డిశ్చార్జి అయ్యారు.  దీంతో ఇప్పటి వరకు  డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,841కు చేరింది. 

ఏపీలో ఇప్పటి వరకు 153 మంది వలసదారులకు కరోనా సోకింది. ఇక ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా కరోనాతో 56మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో  900 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదిలక్షల జనాభాకు సగటున ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటి వరకు  3 లక్షల మందికి టెస్ట్‌లు నిర్వహించారు. నిన్నటితో 3 లక్షల 4వేల 326 టెస్టులు పూర్తయ్యాయి. ఒక్కరోజులో 11వేల 357 టెస్టులు చేశారు. టెస్టుల్లో ఏపీ కంటే ముందు వరుసలో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. 

Read: ఏపీలో కరోనా..లెటెస్ట్ అప్ డేట్..ఎన్ని కేసులంటే

Related Posts