కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లలో యాంటీబాడీలు ఎక్కువ ఉత్పత్తి… అవి ఎక్కువ కాలం ఉండవ్!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ కు సంవత్సర కాలం ముందుగానే కరోనావైరస్ వ్యాక్సిన్లు రెడీ అయిపోయాయి. రీసెర్చ్ స్టడీల ప్రకారం.. కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినవారిలో కొద్దినెలల్లోనే ఇమ్యూనిటీ మాయమవుతుందట. పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్ తయారుచేస్తున్న ప్రొడక్షన్ కంపెనీలపై చన్నీళ్లు జల్లినట్లు అయింది. శరీరంలో యాంటీబాడీలు ప్రొడ్యూస్ అయితే కరోనా మహమ్మారితో పోరాడవచ్చని భావిస్తున్న కంపెనీలు.. ఈ విషయంతో షాక్ అయ్యాయి.

ఇప్పటికీ నిపుణులు ఇదేమంతా చెడ్డ విషయం కాదంటున్నారు. లండన్ లోని కింగ్స్ కాలేజిలో 90 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. లక్షణాలు కనిపించిన మూడు వారాల తర్వాత నుంచి వారిలో యాంటీబాడీల ఉత్పత్తి పీక్స్ లో ఉన్నా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అందులో 16.7 శాతం మందిలో మాత్రమే ఈ యాంటీ బాడీలు తగ్గడం కనిపిస్తుంది. స్పెయిన్ లోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి.

‘లక్షణాలు కనిపించని వారిలో యాంటీబాడీల ఉత్పత్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. అయినా శరీరంలో ఉండే యాంటీబాడీలు ఎక్కువ కాలం జీవించి ఉండవు’ అని ప్రొజెక్ట్ ప్రొఫెసర్ డా.టెట్సూ నకాయమ అంటున్నారు. చాలా దేశాల నుంచి అందిన డేటా ప్రకారం.. SARS-CoV2 యాంటీబాడీలు పేషెంట్లలో తక్కువ కాలమే ఉంటాయి. ఇతర వైరస్ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే ఇవే చాలా వెంటనే ఉంటాయి.

నిజానికి 2002-2003లో ప్రబలిన SARSను ఎదుర్కొన్న వారి శరీరంలో యాంటీబాడీలు 18 సంవత్సరాల వరకూ సజీవంగా ఉన్నాయట. కానీ, అవి వైరస్ ను ఎదుర్కొనేంతలా ఫైట్ చేయగలిగావా అనే దానిపై క్లారిటీ లేదు. ‘టీ సెల్స్‌ ఇమ్యూనోలాజిక్ మెమొరీ ఉండటమే కాకుండా.. వైరస్ తిరిగి రావడాన్ని కూడా అడ్డుకుంటాయి. వీటి వల్ల యాంటీబాడీల ప్రొడక్షన్ మెమెరీని పెంచుతుంటాయి.

’10మంది పార్టిసిపెంట్స్‌కు రెండు వ్యాక్సిన్ల డోస్.. ఇవ్వడంతో దృఢమైన ఇమ్యూనిటీ వస్తుంది. వ్యాక్సినేషన్ కోసం ఇది మంచి స్ట్రాటజీ కూడా. వ్యాక్సిన్ బూస్టర్ తో స్ట్రాంగ్ ఇమ్యూనిటీని సృష్టించుకోవచ్చు. కంఫర్ట్ ఇచ్చేంతలా లేకపోయినా సైట్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు’ అని ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ అంటున్నారు.

Related Posts