కరోనాపై కథనాలు, చైనా మహిళా విలేకరికి జైలు శిక్ష

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Chinese citizen journalist faces jail : కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియచేసినందుకు విలేకరికి ఐదేళ్ల జైలు శిక్షను విధించింది చైనా ప్రభుత్వం. ఝూంగ్ ఝాన్ అనే మహిళ 37 సంవత్సరాలున్న మాజీ న్యాయవాది, సిటిజన్ జర్నలిస్టు ఈ సంవత్సరం ఫిబ్రవరి వూహాన్ కు వెళ్లారు. అక్కడి నుంచి వైరస్ కేసులకు సంబంధించి పలు కథనాలు రాశారు. వైరస్ ఆ ప్రాంతం నుంచే బయటపడిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు వేధించారని, కొంతమంది స్వతంత్ర విలేకరులను కనిపించకుండా చేశారని ఝాన్ కథనాలు రాశారని చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ (CHRD) అనే స్వచ్చంద సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో కొట్లాటకు దిగుతూ…సమస్యలను సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై ఝాన్ ను మేలో అరెస్టు చేశారు.మే 14వ తేదీ నుంచి ఝూన్ కనిపించకుండా పోయారని CHRD వెల్లడించింది. ఒక రోజు తర్వాత..ఝాన్ తమ కస్టడీలో ఉన్నాడని షాంఘై పోలీసులు ప్రకటించారు. జూన్ 19వ తేదీన ఝాన్ ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు నెలల నిర్భంద తర్వాత…ఝాన్ ను కలిసేందుకు న్యాయవాదికి అనుమతినిచ్చింది. అయితే..అరెస్టు నిరసిస్తూ..జైల్లో అతను నిరహార దీక్షకు దిగారని సెప్టెంబర్ 19వ తేదీన దోషిగా నిర్ధారించామని ఝాన్ న్యాయవాదికి ఓ ఫోన్ వచ్చింది.ఝాన్ కేసులో వెలువడిన ప్రతిని పరిశీలించగా..వీ చాట్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా..తప్పుడు సమాచారాన్ని అక్షరాలు, వీడియోల రూపంలో ప్రసారం చేశారని అన్న ఆరోపణలపై ఝామ్ కు శిక్ష విధించినట్లు ఉంది. వూహాన్ లో వైరస్ కు సంబంధించి దురుద్దేశపూర్వక సమాచారాన్ని ప్రచారం చేసినందుకు ఝాన్ ను శిక్షిస్తున్నట్లు అందులో వెల్లడించారు. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల వరకు జైలు శిక్షను విధించాలని న్యాయస్థానం సూచించింది. ఝాన్ తో పాటు కొంతమంది విలేకరులు కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.

Related Tags :

Related Posts :