Coronavirus: Deadly bug has mutated into a new, more infectious strain, scientists warn

కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారింది.. సైంటిస్టుల హెచ్చరిక!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారిందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ రోజురోజుకు కొత్తగా రూపాంతరం చెందుతోంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా వైరస్ వ్యవహరించే లక్షణాల్లోనూ కొత్త మార్పుులు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కంటే ఇప్పుడు కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారిందని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 10.6 మిలియన్లకు పైగా నమోదయ్యాయి.

కొత్త అధ్యయనం ప్రకారం.. కరోనా కేసులలో ఎక్కువ భాగం వైరస్ కొత్తగానూ ఎక్కువ ఇన్ఫెక్షన్లతో అంటువ్యాధిలా మారిందని హెచ్చరిస్తున్నారు. లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీ, డ్యూక్ విశ్వవిద్యాలయం, షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ‘D614G’ అనే కొత్త వేరియంట్ అబ్ నార్మల్ జాతిగా పేర్కొన్నారు. ఈ వేరియంట్ వైరస్ ఉపరితలాలపై ‘Spike’ ప్రోటీన్లలో చిన్న కానీ ప్రభావవంతమైన మార్పును కలిగి ఉంటుందని చెబుతున్నారు. మానవ కణాలలోకి ప్రవేశించి సులభంగా వ్యాధి సోకుతుందని హెచ్చరిస్తున్నారు.

షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని అంటు వ్యాధుల సీనియర్ క్లినికల్ లెక్చరర్ డాక్టర్ Thushan de Silva చెప్పిన ప్రకారం.. మహమ్మారి ప్రారంభంలోనే షెఫీల్డ్‌లోని SARS-CoV-2 జాతులను క్రమం చేస్తున్నామని చెప్పారు. ఈ మ్యుటేషన్‌ను విధానాన్ని పరిశీలించినట్టు తెలిపారు. కరోనా వైరస్ తన జాతులను వ్యాప్తి చేయడంలో ఆధిపత్యం చెలాయించింది. కొత్త D614G జీనోమ్ మ్యుటేషన్ వేరియంట్ కూడా ల్యాబరేటరీ పరిస్థితులలో మరింత అంటువ్యాధిని వ్యాప్తి చేస్తుందని తెలిపారు.

‘షెఫీల్డ్‌లోని బృందం అందించిన డేటా ప్రకారం.. కోవిడ్ -19 ఉన్న రోగుల ఎగువ శ్వాసకోశంలో అధిక వైరల్ లోడ్లతో సంబంధం కలిగి ఉంటారని గుర్తించారు. సంక్రమించే వైరస్ సామర్థ్యాన్ని పెంచుతుందని అర్థం. అధ్యయనంలో పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరల్ డేటాను GISAID డేటాబేస్ ద్వారా విశ్లేషించారు. డేటాబేస్ పదివేల వైరల్ సీక్వెన్స్ తో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడానికి పరిశోధకులు అంచనా వేయొచ్చు.

లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీకి చెందిన డాక్టర్ బెట్టే కోర్బెర్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా SARS-CoV-2 (కోవిడ్ -19) పరిణామాన్ని ట్రాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తమ వైరల్ సీక్వెన్స్ డేటాను GISAID వైరల్ సీక్వెన్స్ డేటాబేస్ ద్వారా వేగంగా అందుబాటులోకి తెస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ద్వారా పదివేల స్వీకెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యంగా రూపుదాల్చిన వేరియంట్ పుట్టుకను గుర్తించడానికి సాయపడిందని అన్నారు.

Related Posts