లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కరోనావైరస్ : ఏపీలో ఇంటింటి ప్రచారం…10,000 మంది విదేశాల నుంచి వచ్చారని గుర్తింపు

రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

Published

on

Coronavirus: Knock, Knock! Andhra's Door-to-door Campaign Tracks Down Over 10k Foreign Returnees

రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టింది. 50 గృహాలను పరీక్షించే బాధ్యతతో అధికారులు 2.5 లక్షలకు పైగా వాలంటీర్లను మోహరించారు. వాలంటీర్ నెట్‌వర్క్ రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన 1,43, 91,654 గృహాల్లో మొత్తం 1,38,58,747 గృహాలను పరీక్షించింది.

ఈ ప్రచారం ద్వారా 10,000 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చారని గుర్తించడానికి ప్రభుత్వానికి సహాయపడింది. ఈ 10 వేల మందిలో 140 మందిలో కరోనా వైరస్ లక్షణాలు చూపించగా, మిగిలిన 9,860 మందికి కరోనా  లక్షణాలు లేవని గుర్తించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని గుర్తించడానికి ఫిబ్రవరి 10, 2020ను కట్-ఆఫ్ తేదీగా నిర్ణయించారు.
కుటుంబంలోని ప్రతి సభ్యునికి COVID-19 గురించి ‘చేయాల్సిన పనులు మరియు చేయకూడని పనులు గురించి వాలంటీర్లు అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచారం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుకోవడమే ప్రభుత్వం లక్ష్యం. అధికారులు ఇప్పుడు డ్రైవ్ పరిధిని విస్తరిస్తున్నారు. ప్రయాణాలు చేయని వారిపై కూడా దృష్టి సారిస్తున్నారు. వైరస్ లక్షణం ఉన్న ఎవరైనా గుర్తించి, అధికారులకు తెలియజేయాలి. 

ఈ ప్రచారం కారణంగా, కేంద్ర రికార్డులలో వివరాలు పేర్కొనబడని వ్యక్తులను, వారి ప్రయాణ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన వారిని అధికారులు గుర్తించవచ్చు. కాబట్టి ప్రతి వాలంటీర్ 50 గృహాలకు బాధ్యత వహిస్తాడు. ఈ 50 గృహాలలో ఒక్కదానిలోనైనా ఏదైనా రోగ లక్షణ వ్యక్తులు లేదా విదేశాశాల నుంచి తిరిగి వచ్చినవారు ఉంటే, ఇచ్చిన మొబైల్ అప్లికేషన్‌లో వాలంటీర్ ఎంట్రీ చేయాలి. ఈ ఎంట్రీలను జిల్లా ఆరోగ్య అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేరుగా పర్యవేక్షిస్తాయి. ఒక నిర్దిష్ట కేసు అవసరాలను బట్టి, ఆరోగ్య బృందాలను అక్కడికి తరలించి, తగిన చర్యలు తీసుకుంటారు.
 

See Also | చైనాలో 500కి పైగా సినిమా థియేటర్లు రీఓపెన్… ప్రేక్షకులు లేరు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *