లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కరోనా అప్‌డేట్: దేశంలో వరుసగా 4వ రోజు 18 వేలకు పైగా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు

Published

on

Coronavirus Live Updates: 18,522 Patients In 24 Hours Takes India's Total To 5.66 Lakh

గత నాలుగు రోజులుగా దేశంలో 18 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారతదేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటికే ఐదున్నర లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 5 లక్షల 66 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 16893 మంది మరణించగా, మూడు లక్షల 34 వేల మంది కూడా కోలుకున్నారు. గత 24 గంటల్లో 18 వేల 522మందికి కొత్తగా కరోనా వైరస్ సోకగా.. ఇదే సమయంలో 418మంది చనిపోయారు.

కరోనా సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశాలలో నాలుగవది. అమెరికా, బ్రెజిల్, రష్యా తరువాత, కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో భారత్ ఉంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (2,637,039), బ్రెజిల్ (1,345,254), రష్యా (634,437). కానీ భారతదేశంలో కేసులు పెరిగే వేగం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత, భారతదేశంలో ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

కరోనా రికవరీ రేటు 58.67%:
దేశంలో కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ, రోగుల రికవరీ రేటు నిరంతరం మెరుగుపడుతోంది. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. కరోనా రోగుల రికవరీ రేటు 58.67% కి చేరుకుంది. కరోనాను పరీక్షించడానికి క్లినికల్ లాబొరేటరీల నెట్‌వర్క్ పెరుగుతున్నందున, భారతదేశంలో ప్రయోగశాలల సంఖ్య ఇప్పుడు 1,047కు పెరిగింది. ఇందులో 760 ప్రభుత్వ, 287 ప్రైవేట్ ప్రయోగశాలలు ఉన్నాయి. జూన్ 28 వరకు 83,98,362 మందిని పరీక్షించగా, వారిలో 170,560 మందిని ఆదివారం పరీక్షించారు.

రాష్ట్రాలవారీగా లెక్కలు:

క్రమ సంఖ్య రాష్ట్ర పేరు మొత్తం కరోనా కేసులు
కోలుకున్నవారు చనిపోయినవారు
1 అండమాన్ నికోబార్ 90 46 0
2 ఆంధ్రప్రదేశ్ 13891 6232 180
3 అరుణాచల్ ప్రదేశ్ 187 61 1
4 అస్సాం 7752 5333 11
5 బీహార్ 9640 7390 62
6 చండీగఢ్ 435 349 6
7 ఛత్తీస్గఢ్ 2761 2173 13
8 ఢిల్లీ 85161 56235 2680
9 గోవా 1198 478 3
10 గుజరాత్ 31938 23240 1827
11 హర్యానా 14210 9502 232
12 హిమాచల్ ప్రదేశ్ 942 556 9
13 జమ్మూ కాశ్మీర్ 7237 4585 95
14 జార్ఖండ్ 2426 1845 15
15 కర్ణాటక 14295 7683 226
16 కేరళ 4189 2152 22
17 లడఖ్ 964 616 1
18 మధ్యప్రదేశ్ 13370 10199 564
19 మహారాష్ట్ర 169883 88960 7610
20 మణిపూర్ 1227 494 0
21 మేఘాలయ 47 42 1
22 మిజోరం 148 55 0
23 ఒడిషా 6859 4946 23
24 పుదుచ్చేరి 619 221 10
25 పంజాబ్ 5418 3764 138
26 రాజస్థాన్ 17660 13618 405
27 తమిళనాడు 86224 47749 1141
28 తెలంగాణ 15394 5582 253
29 త్రిపుర 1380 1085 1
30 ఉత్తరాఖండ్ 2831 2111 39
31 ఉత్తర ప్రదేశ్ 22828 15506 672
32 పశ్చిమ బెంగాల్ 17907 11719 653
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 566840 334822 16893

Read:చైనా దూకుడు.. కరోనాపై యుద్ధం.. జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *