లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు

Published

on

coronavirus

ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు దేశంలో చనిపోతూ ఉండగా.. గత 24 గంటల్లో 81,177 మంది రోగులు కోలుకున్నారు. ఆరు రోజుల తర్వాత కోలుకుంటున్న రోగుల సంఖ్య కొత్త కరోనా సోకిన దానికంటే తక్కువగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతుంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 58 లక్షల 18 వేలకు పెరిగింది. వీరిలో 92,290 మంది మరణించారు. క్రియాశీల కేసుల సంఖ్య 9 లక్షల 70 వేలకు తగ్గింది. 47 లక్షల 56 వేల మంది కోలుకోగా.. ఆరోగ్యకరమైన వ్యక్తుల సంఖ్య చురుకైన కేసుల సంఖ్య కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.



ఐసిఎంఆర్ ప్రకారం, సెప్టెంబర్ 24 వరకు మొత్తం 69.89 మిలియన్ నమూనాలను కరోనా వైరస్ పరీక్షించగా, వాటిలో 15 లక్షల నమూనాలను నిన్న పరీక్షించారు. మరణాల తగ్గుదల క్రియాశీల కేసు రేట్లలో స్థిరమైన క్షీణత నమోదు కావడం ఉపశమనం కలిగించే విషయం కాగా.. మరణాల రేటు 1.58% గా నమోదు అవుతుంది. ఇది కాకుండా, చికిత్స పొందుతున్న క్రియాశీల కేసుల రేటు 17శాతానికి పడిపోయింది. దీంతో, రికవరీ రేటు 82శాతంగా ఉంది. భారతదేశంలో రికవరీ రేటు నిరంతరం పెరుగుతోంది.

దేశంలో మహారాష్ట్రలో అత్యంత చురుకైన కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా అత్యంత ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇక్కడ 12 లక్షల కేసులు నమోదు అవగా.. 33 వేల మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వరసగా కరోనా ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యంత చురుకైన కేసులు నమోదు అవుతుండగా.. క్రియాశీల కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *