Coronavirus Lockdown 2.0: Focus on both life, livelihood

ఏప్రిల్-14న తర్వాత ఎవరు తిరిగి పనులకెళ్లనున్నారు? : రేపే మోడీ లాక్ డౌన్ 2.0 ప్రకటన…”LLL”పైనే ఫోకస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 2.0 దిశగా భారత్ ముందుకెళ్తుంది. లాక్ డౌన్ యొక్క తదుపరి దశకు భారత్ ఎలా ముందుకు వెళ్ళుంది అనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి.

రేపు మోడీ ప్రకటన

గత నెలలో ప్రధాని ప్రకటించిన 21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. దీంతో లాక్ డౌన్ పొడిగింపుపై మంగళవారం(ఏప్రిల్-14,2020) ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 10గంటలకు లాక్ డౌన్ పై మోడీ ప్రకటన చేయనున్నారు. ఏప్రిల్-15నుంచి లాక్ డౌన్ 2.0మొదలుకానుంది.

మూడు ‘L’లపైనే ఫోకస్

అయితే లాక్ డౌన్ 2.0 జీవితం(LIFE), జీవనోపాధి(LIVELIHOOD) మరియు జీవనం(LIVING) అనగా మన జీవితాల గురించి మనం ఎలా వెళ్తామో అనే మూడు Lలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వరకు లాక్ డౌన్ పొడిగింపున పట్టణ ప్రాంతాలు చూడనున్నాయి. అయితే వ్యవసాయం,ఫ్యాక్టరీలు,సరుకు రవాణా వంటి వాటికి మినహాయింపులనిచ్చి భారత ఎకానమీ ఇంజిన్ లను తిరిగి స్టార్ట్ చేయాలని కేంద్రప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

రైతులు,ఫ్యాక్టరీలకు మినహాయింపు

లాక్ డౌన్ 2.0లో రైతులకు మరియు పంటలకు భరోసా కల్పించాలని కేంద్రం ఆలోచ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పొడిగింపు సమయాల్లో కూడా సమంజసమైన రక్షణలతో(RESONABLE SAFEGUARDS)ఎక్కువ పరిశ్రమల కార్యకలాపాలను అనుమతించాలని కేంద్రం ఆలోచిస్తోంది. తక్కువమంది సిబ్బందితో షిఫ్ట్ లను తగ్గించి సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం)ను పాటించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికనష్టాన్ని సరిచేయడానికి మరియు ప్రజల చేతుల్లో నగదు ఉండేందుకు మరిన్ని కార్యకలాపాలు అవసరమని చెబుతున్నారు. ఆటో,టెక్స్ టైల్,ఢిఫెన్స్,ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర కొన్ని సెక్టార్లలో కొంత మ్యానుఫ్యాక్చర్ ను రీసార్ట్ చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది.

అంతేకాకుండా క్యాంప్ లలో ఉన్న వలస కూలీలను ప్రత్యేక బస్సులు,రైళ్ల ద్వారా వాళ్లు పనిచేసే ఫ్యాక్టరీలకు తీసుకొచ్చే ఆలోచనను కూడా కేంద్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రకాల సరుకుల రవాణా అనుమతించే యోచనలో కూడా ఉందని సమాచారం. 

50-75శాతం తగ్గిన రాష్ట్రాల ఆదాయం
గడిచిన నెల రోజులుగా రెవెన్యూ 50-75శాతం పడిపోయిందని రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోడీకి తెలియజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆదాయాలను రాష్ట్రాలు కోల్పోవడంతో ప్రజల ప్రాణాలు కాపాడటం,ఎకానమీ పునరుద్దరణ మధ్యలో రాష్ట్రాలు చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఓ అధికారి తెలిపారు. ఉదాహరణకు,మధ్యప్రదేశ్ రాష్ట్రం ద్రవోల్బణం లింక్ చేయబడిన(inflation-linked) డీఏను తమ ఉద్యోగులకు చెల్లించలేదు. ఏపీలో అయితే ఉద్యోగులకు జీతాలను విడతలవారీనా చెల్లిస్తున్నారు. ఏప్రిల్-15నుంచి లాక్ డౌన్ ఢిఫరెంట్ గా ఉంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలకు మినహాయింపు ఉంటుందని చెప్పారు. దేశంలోని 360కి పైగా జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం కంటే ఈ వారం ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

READ  మందుబాబులకు శుభవార్త : మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్!

మరోవైపు బీజేపీయేతర పాలిత 6రాష్ట్రాలు- ఢిల్లీ,పంజాబ్,మహారాష్ట్ర,తెలంగాణ,వెస్ట్ బెంగాల్,ఒడిషా లాక్ డౌన్ ను ఏప్రిల్-30వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు చెప్పాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ పొడిగింపుకు ఓకే చెప్పినప్పటికీ ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాయి.

అయితే దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉంటే ఆ ప్రాంతాలను ఆరెంజ్ జోన్ గా, 15 కేసుల కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా,వైరస్ ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్ పరిధిలోకి కరోనా ప్రభావం లేని 400 జిల్లాలు రానున్నాయి. ఈ 400 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు. జోన్ల వారిగా దేశంలో లాక్ డౌన్ పై మార్గదర్శకాలు ఉండనున్నట్లు సమాచారం.  గ్రీన్,ఆరెంజ్ జోన్లలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పరిమిత స్థాయిలో ప్రారంభించడం,వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుమతించనున్నారు.(కరోనా నుంచి 3లక్షల 70వేల మంది కోలుకున్నారు.. ఎందుకో తెలుసా? )

Related Posts