లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

తెలంగాణలో కరోనా..రిస్క్ తక్కువే

Published

on

coronavirus low risk : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా..రిస్క్ తక్కువేనంటోంది ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌). మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదని, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు తక్కువగా ఉండడమేనని వెల్లడించింది.జులై 2017 నుంచి జూన్‌ 2018 మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారి గణాంకాలను ఆధారం చేసుకుని రాష్ట్రాల వారీగా కోవిడ్‌–19 బారిన పడి కోలుకున్న.., మరణించిన వారి సంఖ్యను లెక్కిస్తూ ఐఐపీఎస్‌ అధ్యయనం చేసింది. జాతీయ స్థాయిలో 9.38 శాతం గృహాలు రిస్క్‌లో ఉన్నట్లు తెలిపింది.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణాంకాలను సేకరించింది. సగటున 9.38 శాతం గృహాలు రిస్క్‌ జాబితాలో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే..రిస్క్‌ కేవలం 6.12 శాతంగా ఉందని తెలిపింది. ఇక రిస్క్‌ ఉన్న గృహాలు కేరళలో (33.19 శాతంతో) ఉన్నట్టు, ఆ తర్వాతి వరుసలో ఆంధ్రప్రదేశ్‌ 19.82 శాతం, గోవా 15.89 శాతం, పంజాబ్‌ 15.51 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌ 14.49 శాతంతో రిస్క్‌ జాబితాలో ఉన్నాయని వెల్లడించింది.వయసు రీత్యా పరిశీలిస్తే 60 సంవత్సరాలు దాటిన వారిలో రిస్క్‌ ఎక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్‌ పరిశీలన చెబుతోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో అరవై ఏళ్లు దాటిన వారు 52.25 శాతం ఉండగా, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉతెలంగాణలో కరోనా..రిస్క్ తక్కువేతెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా..రిస్క్ తక్కువేనంటోంది ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌). మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదని, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు తక్కువగా ఉండడమేనని వెల్లడించింది.జులై 2017 నుంచి జూన్‌ 2018 మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారి గణాంకాలను ఆధారం చేసుకుని రాష్ట్రాల వారీగా కోవిడ్‌–19 బారిన పడి కోలుకున్న.., మరణించిన వారి సంఖ్యను లెక్కిస్తూ ఐఐపీఎస్‌ అధ్యయనం చేసింది. జాతీయ స్థాయిలో 9.38 శాతం గృహాలు రిస్క్‌లో ఉన్నట్లు తెలిపింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణాంకాలను సేకరించింది.సగటున 9.38 శాతం గృహాలు రిస్క్‌ జాబితాలో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే..రిస్క్‌ కేవలం 6.12 శాతంగా ఉందని తెలిపింది. ఇక రిస్క్‌ ఉన్న గృహాలు కేరళలో (33.19 శాతంతో) ఉన్నట్టు, ఆ తర్వాతి వరుసలో ఆంధ్రప్రదేశ్‌ 19.82 శాతం, గోవా 15.89 శాతం, పంజాబ్‌ 15.51 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌ 14.49 శాతంతో రిస్క్‌ జాబితాలో ఉన్నాయని వెల్లడించింది.వయసు రీత్యా పరిశీలిస్తే 60 సంవత్సరాలు దాటిన వారిలో రిస్క్‌ ఎక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్‌ పరిశీలన చెబుతోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో అరవై ఏళ్లు దాటిన వారు 52.25 శాతం ఉండగా, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవారు 40.82 శాతం ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 15 నుంచి 44 సంవత్సరాల వారుండగా.. 15 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ల సంఖ్య అతి తక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *