లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

corona virus : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధనలివే

Published

on

coronavirus: new rules for Telangana government employees

తెలంగాణలో కరోనా విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కట్టడికి చర్యలు తీసుకుంటున్నా…వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమౌతోంది. ప్రధానంగా..పరిపాలనలో గుండెకాయగా పిలువబడే సచివాలయం, వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రమాదం జరుగకముందే..ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. అందులో భాగంగా ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 2020, జూన్ 22వ తేదీ సోమవారం నుంచి రెండు వారాల పాటు నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. రోటేషన్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అలాగే..గర్భిణీలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు..సెలవు తీసుకుని ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. అయితే..సెలవు తీసుకున్నా..అందుబాటులో ఉండాలని, వారి సేవలు అవసరమైన సమయంలో సమాచారం అందించిన తర్వాత..కార్యలాయానికి రావాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శని వారం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. 2020, జూన్ 22 నుంచి జులై 4వ తేదీ వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గదర్శకాలు కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకే వర్తిస్తాయని స్పష్టతనిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.

కార్యాలయాల్లో : – 
అపాయింట్‌మెంట్‌తో ఉంటనే..ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను రానివ్వాలి.
ఆఫీసుల్లో ఉండే..లిఫ్టుల్లో కేవలం ఆపరేటర్ తో పాటు..మరో ముగ్గురు మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. 
కార్యాలయాలు, అక్కడ ఉండే వాహనాలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. 
ఇక మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఒకేచోట కూర్చోకూడదు.
అన్ని వేళలా భౌతికదూరం పాటించాలి. సిబ్బంది ఇంటి నుంచే భోజనాన్ని తీసుకొని రావాలి.
క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం/శానిటైజేషన్, మాస్కులను  ధరించాలి. 
అధికారులందరూ గదుల్లో ఏసీల వినియోగాన్ని విరమించుకోవాలి. గదుల్లో వెంటిలేషన్‌ సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
డ్రైవర్లందరూ సంబంధిత పేషీ వద్ద కూర్చోవాలి. ఒకేచోట గూమికూడరాదు.

ప్రభుత్వ ఉద్యోగులకు :-
ప్రత్యేక చాంబర్లు ఉండే అధికారులు మాత్రం రోజూ విధులకు హాజరు కావాలి.
క్లరికల్‌ స్టాఫ్, ఆఫీస్‌ సబార్డినేట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్షన్‌ అధికారులు, సహాయ సెక్షన్‌ అధికారులు, ఇతర 4వ తరగతి ఉద్యోగులు విధులకు హాజరుకాని రోజుల్లో వారు పనిచేసే ప్రాంతం (హెడ్‌క్వార్టర్‌)లోనే ఉండాలి. కార్యాలయంలో ఏదైనా పని కోసం వారిని అప్పటికప్పుడు పిలిచే అవకాశం ఉంటుంది. పనిచేసే ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి వీల్లేదు. 
50 శాతం మంది ఆఫీస్‌ సబార్డినేట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర 4వ తరగతి ఉద్యోగులు వారం తప్పించి మరో వారం విధులకు హాజరవ్వాలి.
50 శాతం మంది క్లరికల్‌ స్టాఫ్‌/సర్కులేటింగ్‌ ఆఫీసర్లు రోజు తప్పించి రోజు విధులకు రావాలి. 

Read: తెలంగాణలో 7 వేల కరోనా కేసులు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *