Coronavirus Outbreak: India's COVID-19 case tally crosses 1.45 lakh-mark; death toll tops 4,100

దేశంలో 1.45 లక్షలు దాటిన కరోనా కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్‌లో కరోనా వైరస్ (COVID-19 వ్యాధి) ఏ మాత్రం అదుపులోకి రాలేదు. కరోనావైరస్  కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్నా కూడా కరోనా కేసులు మాత్రం తగ్గు ముఖం పట్టట్లేదు. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోండగా.. భారతదేశంలో కొరోనావైరస్ కేసులు ఐదు రోజులుగా ప్రతిరోజు 6,000పైగా నమోదు అవుతున్నాయి. భారతదేశంలో మొత్తం COVID-19కేసులు మంగళవారం 1.45 లక్షలను దాటగా, మరణాల సంఖ్య 4,100కు చేరుకుంది.

ఈ రోజు(26 మే 2020) ఉదయం 9గంటల 30నిమిషాలకు దేశంలో COVID-19 సంఖ్య 1,45,380కు చేరుకుంది, ఇందులో 80,722మంది చికిత్స చేయించుకుంటుండగా.. 60,491 మందికి నయం అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. ఇక 4,167 మంది మరణించారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,535 కొత్త COVID-19 కేసులు మరియు 146 మరణాలు నమోదయ్యాయి. అయితే భారత్‌లో COVID-19 సంఖ్య నిన్నటి కన్నా తక్కువగా ఉంది. నిన్న, దేశం సుమారు 6,977 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఆదివారం 6,767 కేసులు నమోదవగా.. శనివారం 6,654 కేసులు నమోదయ్యాయి.

కరోనావైరస్ వ్యాప్తి మహారాష్ట్రలో కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కేసుల సంఖ్య భారీగానే ఉంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మహారాష్ట్రలో అత్యధికంగా 52,667కేసులు నమోదవగా.. 1,695మంది మరణించారు. ముఖ్యంగా, దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, కేసుల సంఖ్య 32వేలకు చేరుకున్నది. 

Read: జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తొలి రాష్ట్రం

Related Posts