లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

‘లెదర్ బాల్’ లా గట్టిగా కరోనా పేషెంట్ ఊపిరితిత్తులు….శవపరీక్షలో సంచలన విషయాలు

Published

on

Coronavirus patient’s lungs found ‘hard as a leather ball’ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వస్తోంది. తాజాగా కర్ణాటకలో కరోనాతో మరణించిన 62ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్‌ బాల్‌ మాదరిగా స్ట్రాంగ్‌గా మారినట్లు శవపరీక్షలో తెలిసింది. సదరు వ్యక్తి మరణించిన 18 గంటల తర్వాత కూడా అతడి గొంతు, ముక్కులో నుంచి సేకరించిన స్వాబ్‌ శాంపిల్స్‌ లో వైరస్‌ ఉనికిని గుర్తించారు.శవపరీక్ష నిర్వహించిన ఆక్స్‌ఫర్డ్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దినేష్ రావు మాట్లాడుతూ….రోగి మరణించిన సమయంలో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నారు. మృత దేహాన్ని తీసుకెళ్లలేదు. కుటుంబ సభ్యుల అనుమతితోనే అక్టోబర్‌ 10న ఈ శవపరీక్ష నిర్వహించాం. శవ పరీక్ష నిర్వహించడం కోసం సదరు రోగి ముక్కు, గొంతు, నోరు, ఊపిరితిత్తుల ఉపరితలం, శ్వాసకోశ మార్గాలు, ముఖం, మెడపై చర్మం నుంచి ఐదు శాంపిల్స్‌ని తీసుకున్నాం.ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో ముక్కు, గొంతులో నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. అంటే కరోనా‌ రోగి శరీరం మరణం తర్వాత కూడా వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగా ఉంది.ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, చర్మం మీద నుంచి సేకరించిన శాంపిల్స్‌ నెగిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. శవ పరీక్ష పూర్తి కావడానికి 1.10గంటల సమయం పట్టింది. రోగి ఊపిరితిత్తులు తోలు బంతిలాగా గట్టిగా ఉన్నాయి. రక్త నాళాలలో గడ్డలు ఏర్పడ్డాయి.

ఈ బ్లడ్ గ్రూపువారిపైనే కరోనా తీవ్ర ప్రభావం ఎక్కువంట.. తస్మాత్ జాగ్రత్త!

కరోనాతో మృతి చెందిన వారి శవపరీక్ష.. వ్యాధి పురోగతిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో అమెరికా, ఇటలీలో శవపరీక్ష నివేదికలలో కనిపించిన ఫలితాలకు.. తాను నిర్వహించిన పరీక్ష ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే.. భారత్ లో కనిపించే వైరస్‌ జాతులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *