లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

కరోనా బాధితులు aspirin తీసుకుంటే.. మరణించే అవకాశాలు 47 శాతం తక్కువ!

Published

on

Aspirin Covid-19 Patients : కరోనా బాధితుల్లో ఎవరైనా అస్పిరిన్ తీసుకుంటే వైరస్‌తో మరణించే అవకాశాలు 47 శాతం తక్కువని పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చేశారు. తక్కువ మోతాదు అస్పిరిన్ తీసుకున్న కరోనా బాధితుల్లో ఐసీయూ లేదా వెంటిలేటర్లపై చేరేందుకు 40శాతం కంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని నిర్ధారించారు.University of Maryland School of Medicine (UMSOM) నిపుణులంతా మొత్తంగా 412 మంది కరోనా బాధితుల హెల్త్ రికార్డులను అధ్యయనం చేశారు. Baltimoreలోని UMSOM సెంటర్‌లో కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందించారు. అలాగే ఈస్ట్ కోస్ట్ అమెరికాతో పాటు ఇతర మూడు ఆస్పత్రుల్లో కూడా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించి అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనానికి సంబంధించి ఫలితాలను Anesthesia and Analgesia జనరల్ లో ప్రచురించారు. కరోనా సోకిన బాధితుల్లో మూడింట్లో ఒక వంతు మంది తక్కువ మోతాదు అస్పిరిన్.. ఆస్పత్రిలో చేరిన తర్వాత లేదా అంతకంటే ముందే వాడుతున్నారని నిర్ధారించారు. గుండె సంబంధిత వ్యాధులను నివారించేందుకు ముందుగానే కరోనా పేషెంట్లు పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నారని అధ్యయనంలో తేలింది.ఆస్పత్రుల్లో చేరిన కరోనా పేషెంట్లో అస్పిరిన్ తీసుకోనివారితో పోలిస్తే.. అస్పిరిన్ తీసుకున్నవారు చనిపోవడానికి 47 శాతం తక్కువ అవకాశాలు ఉన్నాయని UMSOMలోని anesthesiology విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ Jonathan Chow నేతృత్వంలోని నిపుణుల బృందం వెల్లడించింది. కరోనా బాధితుల్లో ప్రతిరోజు అస్పిరిన్ తీసుకున్నవారిలో 43 శాతం మంది ఐసీయూలో చేరే రిస్క్ తక్కువగా ఉన్నాయని అధ్యయనం గుర్తించింది.అంతేకాదు.. మెకానికల్ వెంటిలేటర్ పై చేరే ముప్పు 44 శాతం పేషెంట్లలో తక్కువగా ఉంటుందని తేల్చారు. ఈ అధ్యయన ఫలితాలను ధ్రువీకరించాల్సన అవసరం ఉందని ఇందుకోసం మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని డాక్టర్ Chow అభిప్రాయపడ్డారు.ఇదివరకే దీర్ఘాకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో కరోనా సోకితే అస్పిరిన్ తీసుకోవడం ప్రమాదకరమని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు అస్పిరిన్ కారణంగా అలాంటి బాధితుల్లో తీవ్ర దుష్ర్పభావాలతో పాటు మరణానికి కూడా దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *