corona-villages

పల్లెల్లో కరోనా వణుకు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా పల్లెల్లో ఉగ్రరూపం దాలుస్తోంది. పట్టణాల్లో వైరస్ వ్యాపిస్తుండడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వీరితో పాటు..కరోనా వైరస్ కూడా వెళుతోంది. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో చుట్టేసిన కరోనా..ఇప్పుడు పల్లెల్లోకి చొచ్చుకెళుతోంది.



వైరస్ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఊర్లకు వెళ్లిపోతున్నారు. దీంతో పల్లెల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 270 మండలాలు, 1500 గ్రామాల్లోకి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు. సామాజిక వ్యాప్తి కారణంగా ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాల్టీల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అందరిలో ఆందోళన నెలకొంది. దీనికనుగుణంగా…వైద్య వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 1100 కేంద్రాల్లో యాంటిజెన్ కరోనా పరీక్షలు చేస్తుండడంతో కేసుల సంఖ్య వెలుగులోకి వస్తున్నాయి. సీరియస్ కేసులను హైదరాబాద్ కు పంపిస్తున్నారు.



దీంతో నగరంలో ఉన్న ఆసుపత్రుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ప్రతి గ్రామంలో వెలుగు చూస్తున్న కేసుు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, ఉపాధి, ఉద్యోగాల రీత్యా నగరాకు వెళ్లి వచ్చినట్లుగా తేల్చారు. ఫలితంగా…గ్రామాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. పల్లెల్లో కేసుల నియంత్రణ, చికిత్స, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

Related Posts