కరోనా వైరస్ ఆకారంతో వడగళ్ల వాన..! దేవుడు వార్నింగ్ అంటూ హడలిపోతున్న ప్రజలు..!!

 coronavirus shaped hailstones shock mexicans

ట్రెండింగ్ ని మనుషులే కాదు ప్రకృతి కూడా ఫాలో అయిపోతోందా? అనిపిస్తోంది మెక్సికోలోని మోంటేమోరేలోస్ మున్సిపాలిటీలో కురిసిన వర్షం చూస్తే. అక్కడ వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన పెద్ద విశేషంగా కాదు. కానీ అలా కురిసిన వడగళ్ల రూపం చూసిన స్థానికుల గుండె జారిపోయింది. వడగళ్లు సాధారణంగా చిన్న చిన్న ముత్యాల్లా వర్షంతోపాటు పడతాయి. ఒకోసారి వాటి సైజ్ పెద్దగా కూడా ఉంటుంది. కానీ  మోంటేమోరేలోస్ లో కురిసిన వడగళ్ల రూపం అంటే ఆకారం మాత్రం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘‘కరోనా వైరస్ ’’రూపంలో ఉన్నాయి.

వాటిని చూసినవారి గుండెలు దడదడలాడిపోతున్నాయి. ఇది నిజంగా ప్రజలకు దేవుడు ఇచ్చిన వార్నింగ్ అనుకుంటా అని కొంతమంది బేజారెత్తిపోతున్నారు. అంత భయంతోను..‘‘కరోనా వైరస్ రూపం’’లో ఉన్న వడగళ్ల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టటం మాత్రం మరచిపోలేదండోయ్..ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. 

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కరోనా వచ్చిన తరుణంలో లాక్ డౌన్ పాటిస్తు.. ప్రజలంతా ఇళ్లలోనే కుర్చోవాలని దేవుడు ఈ కోరాని వైరస్ రూపంలో వడగళ్లు కురిపిస్తూ..మెసేజ్ పంపించాడని అంటున్నారు.

కానీ వాతావరణ నిపుణులు మాత్రం వీటిని కొట్టిపారేస్తూ..సాధారణ రోజుల్లో కూడా కొన్నిచోట్ల పలు రకాల రూపాల్లో వడగళ్లు పడుతుంటాయని...ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో కరోనా వైరస్ వార్తల్నే మీడియాల్లో ప్రజలు వింటూండటం..ఆ వైరస్ రూపాన్ని చూస్తుండటం..ఆ రూపంలో వడగళ్లు పడటాన్ని చిత్రంగా చూస్తున్నారని అంటున్నారు. 

బలమైన గాలులు, ఒత్తిడి వల్ల మంచు ముద్దలు ఒకదాన్ని ఒకటి ఢీకొని భిన్న ఆకారాల్లోకి మారి కిందపడతాయనీ..ఇటువంటివి సర్వసాధారణమనీ..మెక్సికోలో పడిన వడగళ్లు కూడా అటువంటిదేనని ప్రజలు భయపడాల్సినపనిలేదని తెలిపారు. కానీ ప్రజలు వాటిని నమ్మటంలేదు. బాబోయ్..ఈ కరోనా వడగళ్ళు...ఏదో ప్రమాదం పొంచి ఉంది అనుకుంటూ..తెగ భయపడిపోతు..సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేస్తున్నారు. నలుగురు మాట్లాడిందే నిజం..పలువురు పాడిందే పాట అనుకోవటం..వాటినినమ్మేయటం సమాజంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఇదిగో ఈ ‘‘కరోనా వైరస్’’వడగళ్ల న్యూస్ కూడా సోషల్ మీడియాలో అలాగే వైరల్ గా మారిపోయింది.

Read: ఆన్‌లైన్ లో తందూరీ చికెన్,బిర్యానీ ఆర్డర్ చేసిన ఐసోలేషన్‌ లోని కరోనా రోగులు..డెలివరీ ఇవ్వటానికొచ్చి షాక్ అయిన బాయ్

మరిన్ని తాజా వార్తలు