కోవిడ్ సోకిన తల్లులు.. పుట్టిన బిడ్డకు పాలివ్వడం మానొద్దు : WHO

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా సోకిన తల్లులు తమకు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం మానొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతుంటారు.

బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు కరోనా వైరస్ సోకితే.. వారినుంచి పుట్టిన పిల్లలకు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ ఇటీవల అధ్యయనాలు సూచించాయి. కానీ, వాస్తవానికి COVID వ్యాప్తి తల్లుల నుంచి పాల ద్వారా పిల్లలకు వ్యాపిస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. నవజాత శిశువుల తల్లిదండ్రులకు ఇప్పుడు WHO ఒక గుడ్ న్యూస్ చెబుతోంది. కరోనావైరస్ పాజిటివ్ ఉన్న తల్లిదండ్రుల్లో తమ బిడ్డకు తల్లి పాలివ్వడాన్ని కొనసాగించాలని WHO సూచిస్తోంది.కోవిడ్ సోకిన తల్లిదండ్రుల్లో తమ పిల్లలకు పాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని వైరస్ ఉందని మానేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ Tedros Adhanom Ghebreyesus సూచించారు. కరోనా అనుమానిత లక్షణాలు పాజటివ్ అని నిర్ధారణ అయిన తల్లులు తమ తల్లిపాలను కొనసాగించడానికి ఇతర తల్లుల మాదిరిగానే ప్రోత్సహించాలని WHO సిఫార్సు చేస్తుందని Ghebreyesus చెప్పారు.

brea

మే 2020లో WHO ప్రచురించిన ఒక అధ్యయనంలో 46ఏళ్ల తల్లి, శిశువుకు తల్లి పాలిచ్చే జంటలలో, తల్లులందరికీ COVID-19 ఉందని, కేవలం 13 మంది శిశువులు వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శిశువులు, పిల్లలలో ఆరోగ్యానికి అంటు వ్యాధుల నుంచి ముప్పు ఉంటుంది. అందుకే తల్లి పాలివ్వడం ద్వారా శిశువులకు మరింత రక్షణ ఇస్తుందని సంస్థ పేర్కొంది. శ్రేష్టమైన తల్లి పాల నుంచి శిశువులకు అవసరమైన ఇమ్యూనిటీ అందుతుందని, అదే వారికి శ్రీరామరక్ష అంటోంది..మరో అధ్యయనం ప్రకారం.. తల్లిపాలను ద్వారా COVID-19 వ్యాప్తి చెందే అవకాశమే లేదంటోంది. మూడు న్యూయార్క్ ఆస్పత్రుల్లో మార్చి మే మధ్య నెలలో కరోనా పాటిజివ్ అని తేలిన తల్లిదండ్రులకు 120 మంది శిశువులు జన్మించారు. ఈ సమయంలో పిల్లలకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలతో డెలివరీ రూంలోనే పుట్టిన శిశువుకు పాలిచ్చేందుకు అనుమతించారు.

అప్పుడు పిల్లలకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 120 మంది నవజాత శిశువుల్లో మొదటి 24 గంటలలో COVID-19 కోసం నెగటీవ్ వచ్చింది. 120 మంది శిశువుల్లో 5 నుంచి ఏడు రోజుల మధ్య మరోసారి టెస్టులు చేశారు. 14 రోజుల తరువాత 72 మంది శిశువుల్లో పరీక్షించారు. అప్పుడు కూడా నెగటివ్ అనే తేలింది. నవజాత శిశువులలో కరోనావైరస్ లక్షణాలు కనిపించలేదని వైద్యులు వెల్లడించారు.సరైన పరిశుభ్రత జాగ్రత్తలు తీసుకుంటే పెరినాటల్ ట్రాన్స్మిషన్ సంభవించే అవకాశం లేదని అంటున్నారు. శిశు రక్షణలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది.. అందుకే పాలిచ్చే సమయంలో సురక్షితమైన పద్ధుతులను అనుసరించాలని సూచిస్తోంది. వాస్తవానికి, తల్లి పాలివ్వడం సురక్షితమని కాదు… COVID-19 సోకిన తల్లిదండ్రుల్లో పాలిచ్చే తల్లులు తమ బిడ్డను తాకే ముందు చేతులు కడుక్కోవాలి. తల్లి పాలిచ్చేటప్పుడు మాస్క్ ధరించాలని సూచిస్తోంది. ఏదైనా చేసే ముందు తప్పనిసరిగా తమ చేతులు కడుక్కోవాలని CDC సిఫార్సు చేస్తుంది.

READ  కరోనావైరస్ వ్యాక్సిన్ వాడకానికి రెడీ అంటోంది రష్యా..!

Related Posts