లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లే కరోనాకు అడ్డా.. ఎక్కువ సేపు అక్కడే తిష్టవేస్తాయంట.. జాగ్రత్త!

Updated On - 12:07 pm, Tue, 23 February 21

Coronavirus stay long time on Smartphone Screens : కరోనా వైరస్ ఒక్కో ఉపరితలంపై కొన్ని గంటల పాటు తిష్టవేసి ఉంటుంది. ఉష్ణోగ్రత, గాల్లో తేమ శాతం వంటి అనేక అంశాలపై కరోనా వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇతర ఉపరితలాలతో పోలిస్తే.. ఫోన్ స్ర్కీన్లపై ఉండే కరోనా వైరస్ వెరీ డేంజరస్ అంటోంది కొత్త అధ్యయనం.. తుంపర్ల ద్వారా ఫోన్ స్క్రీన్లపై తిష్టవేసిన కరోనావైరస్.. ఈజీగా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఫోన్ స్ర్కీన్ పై కరోనా ఎక్కువ గంటలు జీవించే ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇతర స్ర్కీన్లపై కంటే.. ఫోన్ స్ర్కీన్లపైనే మూడు రెట్లు అధిక సమయం ఉంటుందని రుజువైంది. ఎందుకంటే.. ఫోన్‌ స్ర్కీన్‌ మీద తడి త్వరగా ఆరిపోదు. అది ఆరడానికి కొంత సమయం పడుతుంది.

ఒకవేళ తుమ్మినా లేదా దగ్గినప్పుడు వైరస్ సంబంధిత నోటి తుంపర్లు ఎక్కువ సేపు స్ర్కీన్ పై అలానే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. నానోలీటర్‌ పరిమాణం ఉన్న తుంపర ఒక నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఆరిపోతుంది. 10 నానోలీటర్ల పరిమాణం ఉన్న నోటి తుంపర ఆరిపోయేందుకు 50శాతం చల్లదనమైన వాతావరణంలో 15 నిమిషాల సమయం పడుతుంది. తక్కువ ఉష్ణోగ్రత కలిగిన వాతావరణంలో తుంపర్లు ఆరేందుకు దాదాపు గంట సమయం పడుతుందని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.

సాధారణ ఉష్ణోగ్రత, చల్లటి వాతావరణం, ఉపరితల పరిమాణం ఆధారగా తుంపర్లలో ఉండే వైరస్‌ ఎంతకాలం జీవించి ఉంటుందనేది నిర్ధారించవచ్చు. తక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ స్ర్కీన్లపై తుంపర్లు ఎక్కువసేపు నిలిచి ఉంటాయి. దాంతో కరోనా వైరస్‌ సజీవంగానే ఉంటుందని అధ్యయనంలో తేలింది. అందుకే ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.