Home » మీలో ఈ కరోనా లక్షణాలు ఉన్నాయా? అయితే ఇమ్యూనిటీ తగ్గినట్టే.. తస్మాత్ జాగ్రత్త!
Published
2 weeks agoon
COVID symptoms could be signs lasting immunity : కరోనావైరస్ నుంచి కోలుకున్నా బాధితుల్లో అనేక అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. చాలామంది కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమందిలో కరోనావైరస్ కొద్ది నెలల్లోనే మళ్లీ సోకిన పరిస్థితులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు తయారవుతాయని అంటారు. అయితే బాధితుల శరీరంలో యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి అనేది స్పష్టత లేదు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారా? అయితే మీలో క్రమంగా ఇమ్యూనిటీ తగ్గిపోతున్నట్టే. తస్మాత్ జాగ్రత్త..
మళ్లీ కరోనా రీఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కోలుకున్న కరోనా బాధితుల్లో ఎంతకాలం ఇమ్యూనిటీ ఉంటుంది అనేది చెప్పలేమంటున్నారు. ఎందుకంటే సాధారణంగా బాధితుల ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంటుందని చెబుతున్నారు. వైరస్ సోకిన ప్రతి బాధితుడిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ట్రాక్ చేయడం ఎంతో కీలకం కూడా. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కరోనా లక్షణాలు, ఇమ్యూనిటీ బాధితులకు మధ్య ఆసక్తికరమైన సంబంధం ఉందని కొత్త అధ్యయనంలో తేలిందని వైద్య నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం..
ఎవరికి కోవిడ్ రీఇన్ఫెక్షన్ హైరిస్క్ ఉందంటే? :
కొంతమందికి కరోనా వైరస్ రెండోసారి సోకే అవకాశం ఉంది. వారిలో యాంటీబాడీల స్థాయిని బట్టి మారుతుంటుంది. మీలోని ఇమ్యూనిటీ బట్టి కరోనా వైరస్ రీఇన్ఫెక్షన్ ప్రభావం ఉందో లేదో చెప్పొచ్చు. comorbiditiesలలో ఎవరికైనా ఇమ్యూనిటీ తగ్గిపోతే మళ్లీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు.
యాంటీబాడీలు ఎంతకాలం ఉండొచ్చు?:
శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్లపై రోగనిరోధక వ్యవస్థ పోరాడేందుకు రెడీగా ఉంటుంది. ఆ క్రమంలో కోవిడ్ యాంటీబాడీలు తయారవుతాయి. కొత్త అధ్యయనాల ప్రకారం.. కరోనా నుంచి కోలుకున్నవారిలో కనీసం 3 నుంచి 6 నెలల్లో ఎప్పుడైనా తగ్గిపోవచ్చు. అసింపిథిటిక్ సహా ఇతర స్వల్ప బాధిత లక్షణాలు కలిగిన కరోనా బాధితుల్లో ఇతరుల కంటే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందని తేలింది.
కొత్త అధ్యయనంలో ఏం తేలింది :
కరోనా నుంచి కోలుకున్న ఐదోవారంలో 113మంది బాధితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేశారు. మూడు నెలల తర్వాత తీసుకున్న బ్లడ్ శాంపిల్స్‌తో పోల్చి చూశారు. పురుషుల్లో ఎక్కువగా తీవ్ర కరోనాతో బాధపడినవారిలో దీర్ఘకాలం యాంటీబాడీలను కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. అలాగే అసింపథిటిక్, స్వల్ప లక్షణాలు కలిగిన బాధితుల్లో యాంటీబాడీల సంఖ్య సాధారణంగా కంటే తక్కువగా ఉంటాయని అంటున్నారు.
వారం కంటే ఎక్కువగా జ్వరం ఉంటుందా? :
సాధారణంగా తక్కువ గ్రేడ్ జ్వరం (99-101) డిగ్రీల ఫారెన్ హిట్ ఉంటే.. అది కరోనా జ్వరం కావొచ్చు.. కరోనా సోకిన 4 నుంచి 5 రోజుల్లో ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ రోజులు జ్వరం ఉంటే ఆందోళన చెందాల్సిందే. యాంటీబాడీల ఉత్పత్తికి వారి శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుంది. జ్వరం వంటి రావడం ద్వారా శరీరంలో రోగనిరోధకత స్పందించడానికి అవకాశం ఉంటుంది. అందుకే స్వల్ప కరోనా లక్షణాలు కలిగిన వారిలో తక్కువగా యాంటీబాడీలు ఉండటానికి కారణం ఇదేనంటున్నారు.
ఆకలి మందగించడం :
ఆకలి లేకపోవడం లేదా ఆకలి మందగిస్తుంది. సాధారణ వైరస్ సోకినప్పుడు కూడా ఇలాంటి భావనే అనిపిస్తుంది. కరోనా బాధితుల్లో ఆకలి లేకపోవడానికి వారిలో ఆహారపు అలవాట్లతో తీవ్ర కరోనాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇతర కరోనా లక్షణాల్లో వాసన, రుచి లేకపోవడం, గొంతునొప్పి, వికారం, తీవ్ర అలసటగా అనిపించడం వంటివి ఎక్కువగా ఉంటాయి.
డయేరియా :
డయేరియా.. కరోనా బాధితుల్లో తీవ్ర లక్షణాలు ఉన్నవారిలో ఎక్కువగా ఈ లక్షణం కనిపిస్తుంది. వాంతులు, రుచి కోల్పోవడం వంటి ఇతర లక్షణాలతో కలగలసి ఉంటుంది. జీర్ణసంబంధిత సమస్యలతో కూడా సంబంధం ఉంటుంది. ఇలాంటి కరోనా బాధితులే ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరుతారు. సహజంగా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినప్పుడే వారిలో రోగనిరోధక శక్తి ప్రతిస్పందించడానికి వీలుంటుంది. ఇమ్యూనిటీ సెల్స్ పెరిగితే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
పొత్తికడుపులో నొప్పి, తిమ్మిరులు :
జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారిలో పొత్తికడుపులో నొప్పి, తిమ్మిరిగా అనిపించడం కరోనాతో సంబంధం ఉన్నట్టేనని రీసెర్చర్లు గుర్తించారు. కరోనా వైరస్ సోకినప్పటి నుంచి పొత్తికడుపులో నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటివారిలో ఎక్కువ యాంటీబాడీలు, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ రెండింటి మధ్య పరస్పర సంబంధాన్ని తేల్చాలంటే మరింత పరిశోధన అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.