మళ్లీ కరోనా కర్ఫ్యూలు, మరణాలు 1.32 లక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Coronavirus updates : భారతదేశంలో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90.50 లక్షలకు దాటింది. మరణాల సంఖ్య 1.32 లక్షలుగా ఉంది. గత 24 గంటల్లో 46 వేల 232 పాజిటివ్ కేసులు 564 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలు రాష్ట్రాలు కరోనా వైరస్ విస్తరించకుండా కఠిన నియమ నిబంధనలు ప్రకటిస్తున్నాయి.అందులో భాగంగా రాత్రి వేళ కర్ఫ్యూలు, 144 సెక్షన్ విధించాలని పలు రాష్ట్రాలు నిర్ణయిస్తున్నాయి. ఢిల్లీలో మాస్క్ లు ధరించకుంటే..రూ. 2 వేల జరిమాన విధిస్తున్న సంగతి తెలిసిందే. పెండిండ్లకు కేవలం 50 మందిని మాత్రమే అనుమతినిస్తున్నారు. ముంబైలో డిసెంబర్ 31 వరకు స్కూళ్లు తెరవవద్దని నిర్ణయం తీసుకున్నారు.గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు పూర్తి కర్ఫ్యూ విధిస్తున్నారు. పాలు, మందు దుకాణాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు.
రాజ్ కోట్, సూరత్, వడోదరలో రాత్రి కర్ఫ్యూ విధించారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఈ నెల 21 నుంచి సెక్షన్ 144 అమల్లోకి తెచ్చారు. హర్యానా, మణిపూర్ లో స్కూల్స్ పున:ప్రారంభ ఆదేశాలు నిలిపివేశారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్, భోపాల్, గ్యాలియర్, రత్లామ్, విదిశలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
1 నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లు మూసే ఉండనున్నాయి.
సినిమా హాళ్లు 50 శాతం సామర్థ్యంతోనే నడుస్తాయి.మొత్తం భారతదేశంలో 90, 50,597కి చేరుకున్నాయి. మృతులు 1,32,726కి చేరాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 49,715 మంది, మొత్తంగా 84,78,124 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 93.67 శాతంగా ఉంది. మరణాల రేటు 1.47 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసులు 4.86 శాతంగా ఉన్నాయి. 24 గంటల్లో 10,66,022 శాంపిల్స్ కు మొత్తంగా 13,06,57,808 శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

Related Tags :

Related Posts :