లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

కరోనా వ్యాక్సిన్లు.. వైరస్ మ్యుటేషన్లను అడ్డుకోలేవా? కొత్త అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

Published

on

Coronavirus vaccines and mutations : కరోనా వైరస్ వేగంగా మ్యుటేషన్ అవుతోంది. కొత్త స్ట్రయిన్ లు పుట్టుకొస్తున్నాయి. మొదట్లో వచ్చిన కరోనా కంటే ఈ కొత్త స్ట్రయిన్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రాణాంతకం కూడా అంటున్నారు. డిసెంబర్ మధ్యలో యూకేలో పుట్టిన యూకే (B.1.1.7), సౌతాఫ్రికా (B.1.351) స్ట్రయిన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. స్పైక్ ప్రోటీన్ కలిగిన ఈ రెండు కొత్ స్ట్రయిన్లు ఒక్కొక్కటి అనేక స్ట్రయిన్లుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ రెండు మ్యుటేషన్లు ఎక్కువగా అంటువ్యాధులను వ్యాప్తిచేయగలవు. యూకే, దక్షిణాఫ్రికాలో కరోనా కేసుల పెరుగదలకు ఇవే కారణమని అధ్యయనాలు కూడా తేల్చేశాయి.

అమెరికా సహా ఇతర దేశాల్లోనూ ఈ కొత్త స్ట్రయిన్లు వణికిస్తున్నాయి. కరోనా ఇమ్యూనిటీపై కొత్త మ్యుటేషన్లు ప్రభావం ఎక్కువగా ఉండొచ్చునని డాక్టర్లు, వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే నెలల్లో కరోనా వ్యాక్సిన్లు వేసినా మళ్లీ వైరస్ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అసలు వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అనే ఆందోళన నెలకొంది. ఈ రెండు మ్యుటేషన్లకు సంబంధించి కొత్త అధ్యయనాలు డేటాను విడుదల చేశాయి. ప్రస్తుత వ్యాక్సిన్లు యూకే స్ట్రయిన్లు ఇంకా పనిచేస్తున్నాయని అంటున్నారు. కానీ, సౌతాఫ్రికా వేరియంట్ మాత్రం సమస్యాత్మకంగా కనిపిస్తోంది.

ఫైజర్ బయోఎంటెక్ ల్యాబరేటరీలో చిమెరిక్ వైరస్‌ను సృష్టించాయి. B.1.1.7 లో కనిపించే పూర్తి స్పైక్ ప్రోటీన్‌ను చూపించింది. SARS-CoV-2 మ్యుటేషన్లకు వ్యాక్సిన్ మార్పు అవసరమైతే mRNA వ్యాక్సిన్ ప్లాట్‌ఫాం బాగా సరిపోతుందని అంటున్నారు. పూర్తి ఫైజర్ / బయోఎంటెక్ అధ్యయనం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఇంకా సమీక్షించాల్సి ఉంది. B.1.351 మ్యుటేషన్.. మూడు వేర్వేరు మోనోక్లోనల్ డ్రగ్స్ నుంచి యాంటీబాడీలను, ప్లాస్మా మార్పిడి నుంచి యాంటీబాడీలను నివారించగలదని దక్షిణాఫ్రికాకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు.

మోనోక్లోనల్ మందులు, ప్లాస్మా కూడా టీకాల మాదిరిగానే స్పైక్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ, డ్రగ్స్, టీకాలు వైరస్ ను అడ్డుకోవడంలో విఫలమైతే.. వైరస్ శరీరం లోపల మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. టీకాలు స్ట్రయిన్లపై పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయకపోవచ్చునని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలో యాంటీబాడీలను పరీక్షించగా.. సగంలో B.1.351 మ్యుటేషన్‌ను తటస్తం చేయలేవని తేలిందని దక్షిణాఫ్రికా NICD పరిశోధకులు పేర్కొన్నారు.