Coronavirus in Visakhapatnam, Corona symptoms for two men from Kuala Lumpur

వైజాగ్ లో కరోనా : కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం రేపింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ కుటుంబంలో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.

విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం రేపింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ కుటుంబంలో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వారిని ఎయిర్ పోర్టు నుంచి నేరుగా చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య అధికారులు వారి శాంపిల్స్ పూణెకు పంపారు. కరోనాపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్యాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

బుధవారం (మార్చి 4, 2020) కౌలాలంపూర్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారికి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు చేశారు. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత వారికి ఒకే సారి వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు ఉండటంతో వారిని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి ఎక్కువగా జలుబు, దగ్గు, వాంతులు, విరోచనాలు అవుతుండటంతో కరోనా లక్షణాలున్నట్లు గమనించిన వైద్యులు వారి శాంపిల్స్ ను పూణెకు పంపించారు. ఆ శాంపిల్స్ నుంచి రావడానికి 72 గంటలు పడుతుంది. 

కానీ వారికి కోవిడ్ 19 సోకినట్లు కనిపిచండం లేదు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ నెగెటివ్ రిపోర్టులు వస్తాయని ఆశిస్తున్నట్లు వైద్య అధికారులు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా వైద్య అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకవేల కరోనా వచ్చినట్లైతే జిల్లాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి…మందులు ఉన్నాయా.. వైద్యం అందించడానికి సరిపడా వైద్య పరికరాలు ఉన్నాయా..లేదా అనే అంశంపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు మొత్తం మూడు చోట్ల ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అనకాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి, కేజీహెచ్, చెస్ట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్స్ తోపాటు మాస్కులను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత గల మాస్కులను ఏర్పాటు చేశారు. ఐవీ ఫ్లూయెడ్స్ ను సిద్ధంగా ఉంచారు. 
 

Related Tags :

Related Posts :