చీపురుతో జాగ్రత్త.. కరోనా వచ్చే ప్రమాదం, ఎయిమ్స్ డాక్టర్ హెచ్చరిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ కరోనా వ్యాప్తి గురించి మరో షాకింగ్ విషయం చెప్పారు. మన ఇళ్లలో శుభ్రం చేసుకునేందుకు వాడే చీపురుతో కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇంటి బయట చీపురు వాడితే… కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇంటి బయట చీపురు బదులు వాక్యూమ్ క్లీనర్ వాడటం బెటర్ అని సూచిస్తున్నారు.

చీపురు వాడినప్పుడు నేలపై ఉండే దుమ్ము పైకి లేస్తుంది:
ఎయిమ్స్‌లోని సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్, డాక్టర్ అనురాగ్ శ్రీవాస్తవ ఈ విషయం చెప్పారు. ”చీపురు వాడినప్పుడు నేలపై ఉండే దుమ్ము పైకి లేస్తుంది. అందులో కరోనా వైరస్ ఉంటే… అది మనుషులకు సోకే ప్రమాదం ఉంది. ఎలాంటి ప్రదేశంలోనైనా కరోనా వైరస్ 3 రోజుల నుంచి 5 రోజుల దాకా బతికి ఉంటుంది. ఆ తర్వాత దానిలో శక్తి తగ్గిపోతుంది” అని ఆయన వివరించారు.

చీపురు కారణంగా అత్యంత ఈజీగా కరోనా సోకే ప్రమాదం:
మనం చీపురుతో ఊడ్చేటప్పుడు… దుమ్ము, ధూళి కణాలు పైకి లేస్తాయి. అప్పటివరకూ నేలపై పడి ఉండే కరోనా వైరస్ గాల్లోకి లేస్తుంది. ఆ దుమ్ముతోపాటే అది కూడా ప్రయాణిస్తుంది. అందువల్ల ఊడ్చేవారితోపాటూ… అటుగా వెళ్లేవారికి కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని డాక్టర్ అనురాగ్ చెప్పారు. చీపురు కారణంగా అత్యంత ఈజీగా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారాయన.

చీపురు వద్దు, వాక్యూమ్ క్లీనర్ ముద్దు:
అక్టోబర్ 2న దేశంలో పరిశుభ్రతా కార్యక్రమం జరగబోతోంది. ఆ రోజు దేశంలో ప్రజలు చీపుర్లతో కాకుండా… వాక్యూమ్ క్లీనర్లతో పరిసరాలు శుభ్రం చేసుకోవాలని డాక్టర్ శ్రీవాస్తవ కోరారు. కాగా, మన దేశంలో 95 శాతం మంది చీపుర్లే వాడుతున్నారు. వారిలో వాక్యూమ్ క్లీనర్ కొనేంత స్థోమత లేని వారు కోట్లలో ఉన్నారు. ఇక రోడ్లపై ఊడ్చే పారిశుధ్య కార్మికుల దగ్గర చీపుర్లే ఉంటాయి.

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియక ప్రజలు భయంతో బతుకుతున్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుంది అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కరోనా వ్యాప్తిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముక్కు, నోరు నుంచి వెలువడే తుంపర్లు.. కరోనా సోకిన వ్యక్తిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తాకడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని ఇటీవలే తెలిసింది. ఇక ఇప్పుడు ఇంట్లో ఉపయోగించే చీపురు వల్ల కూడా కరోనా వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది.

READ  భారత్ లో కరోనా కల్లోలం, 2లక్షలు దాటిన కేసులు

Related Posts