నా పార్టనర్‌కు పోర్న్ అంటే పిచ్చి.. అది మా లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శృంగారమనేది ఓ అందమైన అనుభవం అంటారు సెక్సాలిజిస్టులు.. వాస్తవానికి ఇద్దరు పార్టనర్ల మధ్య లైంగిక జీవితం వారి మధ్య సాన్నిహిత్యంపై ఆధారపడి ఉంటుంది.. ఒకరి పట్ల ఒకరికి నమ్మకంతో పాటు లైంగిక ఆకర్షణ తప్పక ఉండాలి..
అప్పుడే వారిద్దరిలో రొమాన్స్ ఎంజాయ్ చేయొచ్చునని చెబుతున్నారు.. కొంతమంది తమ పార్టనర్ ను ఎక్కువగా సంతోష పెట్టాలని లేదంటే తన గురించి ఏం అనుకుంటుందోనన్న భయం మగాళ్లలో చాలావరకు ఉంటుంది.. అది బయటకు చెప్పలేక తమలోనే తాము దాచుకుంటుంటారు..

Could my Partner's porn habit be hurting our sex life?
పార్టనర్ సంతృప్తి పరిచేందుకు పోర్న్ ఎక్కువగా చూసేస్తుంటారు. అందులో మాదిరిగా తమ పార్టనర్‌‌తో రొమాన్స్ చేయాలని భావిస్తుంటారు. ఈ విషయంలో మంచి కంటే పార్టనర్ల మధ్య సాన్నిహిత్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సెక్సాలిజిస్టులు.. పోర్న్ అతిగా చూసేవారితో పార్టనర్ మధ్య లైంగిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు..

ఇదే విషయంలో ఓ పార్టనర్ తన పార్టనర్ కు పోర్న్ చూసే అలవాటు ఉందని చెప్పింది.. తాను ఎక్కువగా పోర్న్ చూస్తుంటాడని తెలిపింది.. అతడు తనను మోసం చేస్తున్నాడనని ఫీల్ అవుతున్నట్టు చెప్పింది.ప్రస్తుతం తమ లైంగిక జీవితం బాగున్నప్పటికీ పోర్న్ చూడటం వల్ల అది తమ లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుందోమోనని భయంగా ఉందని చెప్పింది. దీనిపై సెక్సాలిజిస్టులు తమదైన శైలిలో సమాధానమిచ్చారు..

పోర్న్ ఎందుకు చూస్తుంటారు? :
చాలామంది పోర్న్ చూడటానికి అనేక వివిధ రకాల కారణాలు ఉంటాయి.. అందులో స్వీయ తృప్తి కోసం ఆరాటపడేవారు ఎక్కువగా ఇలా చేస్తుంటారు.. అందులో ఎక్కువ మంది హస్త ప్రయోగం ద్వారా పోర్న్ చూస్తూ తమలోని కోరికను తీర్చుకుంటుంటారు.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో సెక్సువల్ వీడియో కంటెంట్ తెగ చూసేస్తున్నారు.. హస్త ప్రయోగమనేది రొమాన్స్ కు ప్రత్యామ్నాయం కాదంటున్నారు.

అది లైంగిక చర్యలో ఒక భాగమే అన్నారు. సోలో రొమాన్స్ లేదా పార్టనర్ తో రొమాన్స్ అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

ఇంట్లో ఒంటరిగా ఉన్నవాళ్లలోనే ఎక్కువ :
ఇంట్లో ఒంటరిగా ఉండే వాళ్లు తమ పార్టనర్ లేని సమయంలో పోర్న్ చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారంట.. అలా పోర్న్ చూస్తూ సంతృప్తిచెందుతుంటారు..ఎక్కువ కాలం ఒంటరితనానికి అలవాటు పడిన వారిలో పోర్న్ చూడాలనే కోరిక ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సెక్సాలిజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

అవగాహన కోసం చూస్తున్నారంట:
కొంతమంది లైంగిక జీవితంపై అవగాహన కోసం పోర్న్ బాట పడుతున్నారంట.. లైంగిక జీవితంలో స్ఫూర్తి నింపేందుకు కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహంలో పోర్న్ చూస్తున్నారంట.
వాస్తవానికి పోర్న్ చూడటమనేది లైంగిక విద్య కానే కాదనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.

అది కేవలం ఫాంటసీ, అడల్ట్ ఎంటర్ టైన్మెంట్ మాత్రమేనని చెప్పారు.
పోర్న్ చూడటానికి బదులుగా ఎవరైనా సెక్స్ థెరపిస్ట్ లేదా సెక్స్ కోచ్ ను సంప్రదించండి.. వారితో మాట్లాడి మీలోని అనుమానాలను నివృతి చేసుకోవచ్చు.
పోర్న్ చూడటం.. ఎప్పుడు సమస్యగా మారుతుంది :
* పోర్న్ చూడటం వల్ల పార్టనర్ తో రొమాన్స్ పై ఆసక్తి తగ్గుతుంది.. ఎక్కువగా హస్త ప్రయోగానికే ప్రాధాన్యం ఇస్తుంటారు.
* సాధారణ రోజువారీ ప్రవర్తనలో మార్పులు వస్తాయి.. పోర్న్ ప్రభావం అధికంగా పడుతుంది.. మీరు తప్పుడు దారిలో వెళ్లే ప్రమాదం ఉంది.

* దాంపత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ లైంగిక ప్రవర్తన చూసి పార్టనర్ మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. పోర్న్ మాదిరిగా పార్టనర్ పై ప్రయోగాలు చేస్తే అది మీ లైంగిక జీవితాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు జాగ్త్రత్త..* అదే పనిగా పోర్న్ చూడటం అలవాటుగా మారితే.. అది దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తుంది.. ఉద్యోగం, చదువులపై ప్రభావం పడుతుంది.

నిద్రలేమితో పాటు మానసికంగా ఆందోళనకు గురవుతారు.

* పోర్న్ ఎక్కువగా చూస్తే వారిలో మూడ్ దెబ్బతింటుంది.. సరిగా ఆలోచించలేరు.. ప్రతిదానికి ఆవేశపడుతుంటారు..

* హస్త ప్రయోగానికి బానిసగా మారిపోతారు.. సోలో శృంగారమే జీవితంగా మారిపోతుంది.. పార్టనర్ ను పట్టించకోవడం మానేస్తారు..

* మీ పార్టనర్ లో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురైతే వెంటనే సంబంధింత లైంగిక ఆరోగ్య ప్రొఫెషన్లను సంప్రదించాలని సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు.

పోర్న్ చూసేవారితో పార్టనర్లు ఎందుకు ఇబ్బంది పడతారంటే? :
పోర్న్ చూడటమనేది చాలా కామన్… కానీ, చాలామంది తమ పార్టనర్ కంటే ఇలా పోర్న్ చూడటాన్నే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.. తమతో కాకుండా పోర్న్ చూస్తూ తృప్తిపడేవారితో పార్టనర్లు తమను మోసం చేస్తున్నారనే భావన కలుగుతుంది.

పోర్న్ చూస్తున్నారంటే అది మీ లైంగిక జీవితాన్ని మరింత ఆనందపరుస్తుందని సంకేతం కాదని గుర్తించాలి.ఇలాంటి అలవాటు ఉన్నవారు ఎక్కువగా తమ పార్టనర్ కు దూరంగా ఒంటరిగా ఉండి అశ్లీల వీడియోలపై ఆకర్షితులవుతారు. ఇద్దరు పార్టనర్లు ఫన్ కోసం ఆసక్తిగా పోర్న్ కలిసి చూడొచ్చు.. అది మితిమీరకూడదు..

నా పార్టనర్ నాతో రొమాన్స్ కంటే పోర్న్ చూడటానికే ఇష్ట పడతారా? :
సాధారణంగా అలా చేయరు.. అందుకు చాలా కారణాలే ఉంటాయి. పోర్న్ చూసేవారిలో పార్టనర్ తో లైంగిక చర్యలో ఎక్కువగా కంగారుపడుతుంటారు.
పార్టనర్ కు ఇష్టం లేకపోయినా తనతో రొమాన్స్ చేయాల్సందిగా ఒత్తిడి తెస్తుంటారు. పోర్న్ వల్ల పార్టనర్ తో శృంగారం కంటే సింగిల్ గానే హస్త ప్రయోగం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

అందుకే ఇలాంటి సమస్యలకు దారితీయకుండా పార్టనర్ జాగ్రత్త పడాలి.. వాస్తవానికి తన పార్టనర్ ఎంజాయ్ చేస్తుందో లేదా అని అడిగి తెలుసుకోవాలి.తన ప్రవర్తనతో ఎలాంటి ఇబ్బంది ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నించాలి. అప్పుడే ఇరువురిలో లైంగిక ఆనందానికి ఇబ్బందులు ఉండవు..

పోర్న్‌లో మాదిరిగా అలానే రొమాన్స్ కోరుకుంటారా? :
సాధారణంగా.. పోర్న్ చూసేవారు ఎంజాయ్ కోసం చూస్తారంట.. అంతేకానీ, తన పార్టనర్ ను అందులో వారితో పోలిక పెట్టరు..
వారి ఆలోచనలో పార్టనర్ తో రొమాన్స్ అనేది ఒక ప్రత్యేకమైనది భావిస్తుంటారు.పోర్న్ కలిసి చూస్తే.. అలానే చేయమంటారేమో :
తన పార్టనర్ తో కలిసి పోర్న్ చూస్తే.. తనను కూడా అలానే చేయమంటారేమోనని భయంగా ఉందని తాన్య తన మనస్సులోని అభిప్రాయాన్ని బిడియంగానే బయటపెట్టింది.

ఇలాంటి పరిస్థితుల్లో బెడ్ రూంలో ఒకరినొకరు కలిసి ఓపెన్ గా మాట్లాడుకోవాలి..
రొమాన్స్ పరంగా ఎలా చేస్తే ఇరువురికి ఆనందంగా ఉంటుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు సెక్స్ నిపుణులు.. అంతేకానీ, పోర్న్ కంటే తమకు తాము ఎలా రొమాన్స్ ఎంజాయ్ చేయగలమో చర్చించుకోవాలని సూచిస్తున్నారు..
అప్పుడే లైంగిక జీవితం దెబ్బతినకుండా ముందుకు లీడ్ చేయొచ్చునని అంటున్నారు.

Related Posts