కోడిగుడ్డుతో కోవిడ్ కు చెక్ పెట్టే యోచనలో శాస్త్రవేత్తలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Chicken Antibodies Be The Next Weapon Against Covid-19 : కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో పలు దేశాలు తయారు చేస్తున్నటీకాలు క్లినికల్  ట్రయల్స్  దశలో ఉన్నాయి. రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కంటైనర్లు క్లినికల్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ వచ్చాయి. వీటిని స్ధానికంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 2వేల మంది పై ప్రయోగాలు చేయనుంది.

అయితే ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన టీకాల పని తీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఒకవైపు టీకా పని తీరుపై పరిశోధనలు సాగిస్తూనే కరోనాకు మందు కనిపెట్టేందుకు కూడా శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు.కోడి గుడ్డు ద్వారా లభించే యాంటీ బాడీస్ తో కరోనా కుకొంతవరకు చెక్ పెట్టే యోచనలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఉన్నారు. కోడి గుడ్డు సొన నుంచి తయారు చేసిన నాజల్ స్ప్రే ద్వారా కోవిడ్ నుంచి కొంత వరకు రక్షణ పొందవచ్చని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కెమికల్ అండ్ సిస్టమ్స్ బయాలజీ ప్రొఫెసర్ డారియా మోచ్లీ-రోసెన్ చెప్పారు.

కోవిడ్ కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి యాంటీబాడీ నాజల్ స్ప్రేను ఉపయోగించడంపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఆస్పత్రిలో చేరక ముందే దీనిని ముక్కులో స్ప్రే చేసుకుంటే కొంతవరకు కోవిడ్ నుంచి రక్షించబడవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.ఇందులో భాగంగా కోడి నుంచి తయారు చేసే నాజల్ డ్రాప్స్ ను అభివృధ్ది చేసే పనిలో సైంటిస్టులు ఉన్నారు. దీన్ని ఉపయోగించటం వల్ల కొంత కాలం కోవిడ్ నుంచి రక్షణ పొంద వచ్చని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మరియు పెర్త్ యొక్క లీనియర్ క్లినికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సెలవిచ్చారు.

వారు గుర్తించిన దాని ప్రకారం…కోళ్లు SAR-CoV-2 యొక్క స్పైక్ ప్రోటీన్ బారిన పడ్డాయి. అవి తమలో భారీగా రోగ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. ఇమ్యునోగ్లోబులిన్ Y (IgY) అని పిలువబడే నిర్దిష్ట యాంటీబాడీస్ ఉత్పత్తికి కారణమవుతాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆసమయంలో సరసమైన సంఖ్యలో ప్రతిరోధకాలు గుడ్లలోకి ప్రవేశిస్తాయి. గుడ్డుసొన నుంచి సేకరించిన యాంటీబాడీస్ ను సైంటిస్టులు ముక్కు రంధ్రాల్లో ప్రయోగించినట్లు స్టాన్ఫోర్డ్ వెబ్‌సైట్‌లో వివరించారు.కోడి గుడ్ల సొన నుంచి సేకరించిన యాంటీబాడీలతో తయారు చేసిన స్ప్రే ముక్కులో వేయటం వలన కరోనా నుంచి కొంతకాలం రక్షణ కల్పిస్తాయని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోజరిపిన పరిశోధనల్లో పాల్గోన్న డాక్టర్ మోచ్లీ-రోసెన్ చెప్పారు. దీనివల్ల రోగుల్లో కొంతకాలం రోగ నిరోధక శక్తి పెరుగుతున్నట్లు గుర్తించారు.

ఇందుకోసం ప్రస్తుతం 48 మంది పేషెంట్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని.. దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందనేది కూడా ఇప్పటికీ తెలియదని ఆయన అన్నారు. ఇది స్వల్పకాలికి పరిష్కారంగామాత్రమేమనని..పూర్తి స్ధాయి టీకా వచ్చే వచ్చేంతవరకు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి తక్కువ ఖర్చుతో కూడిన ఔషధాన్ని అందిచగలమన్న ఆశాభావాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.కోడి గుడ్డు లోని పచ్చసొన నుంచి శాస్త్రవేత్తలు యాంటీ బాడీస్ సేకరించారు. వాటినుంచి నాజల్ డ్రాప్స్ తయారు చేశారు. వీటిని కరోనా రోగులపై ప్రయోగిస్తున్నారు. దీంతో రోగుల్లో కొంతకాలం రోగనిరోధక శక్తి పెరిగినట్లు గుర్తించారు. జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ పనిచేసే సిబ్బంది ఈ నాజల్ డ్రాప్స్ వాడటం వల్లన కరోనా సోకకుండా అడ్డుకోవచ్చని వారు తెలిపారు.

ప్రయోగాలు సఫలం అయితే అతి తక్కువ ధరకే నాజల్ స్ప్రే అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రయోగం డిసెంబర్ 2020 నాటికి విజయవంతం కావచ్చని ఆశాభావాన్నివారువ్యక్తం చేశారు. మరో వైపు కరోనా ను కట్టడి చేసేందుకు ఒంటెలను పోలిన లామాలు, గుర్రాలు, గాడిదల నుంచి యాంటీబాడీలు తీసుకుని కరోనా టీకాను తయారు చేయడానికి ప్ర్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి.ఏది ఏమైనా పూర్తి స్ధాయిలో కరోనా వైరస్ టీకా వచ్చేంతవరకు మాస్క్ పెట్టుకోవటం…శానిటైజర్ వాడటం… భౌతిక దూరం పాటించటం … చేతులు శుభ్రం చేసుకోవటం వంటివాటిని పాటించి వైరస్ కుచెక్ పెట్టాలని ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి.Related Tags :

Related Posts :