2014కి ముందు కరోనావైరస్ వస్తే.. లాక్‌డౌన్ విధించగలమా? : మోడీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

2014కి ముందు కరోనావైరస్ వంటి మహమ్మారి వచ్చి ఉంటే ఏమి జరిగేదో ఓసారి ఊహించుకోండి.. అందరూ ఇళ్లకే పరిమితమై ఉండేవారా? అప్పట్లో బహిరంగ మల విసర్జన చేయాల్సిన పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిచెందితే ఇప్పటిలానే లాక్ డౌన్ విధించగలమా?

60శాతానికి పైగా జనాభా బహిరంగ మలవిసర్జన చేయాల్సిన పరిస్తితులవి.. ఆ సమయంలో మేం లాక్ డౌన్ విధించడం సాధ్యపడేదా? అని రాష్ట్రీయ స్వచ్చా కేంద్ర ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అయిన రాష్ట్ర స్వచ్చా కేంద్రం (RSK)ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్వచ్ఛత కేంద్రం మహాత్మా గాంధీ పరిశుభ్రత కోసం చేసిన కృషికి నివాళిగా మోడీ పేర్కొన్నారు. కరోనావైరస్‌ కట్టడి చేసే పోరాటంలో శుభ్రత సాయంగా మారిందన్నారు. భారతదేశాన్ని స్వచ్ఛత దిశగా నడిపించేందుకు ఆగస్టు 8-15 నుండి వారం రోజుల పాటు స్వచ్ఛత క్యాంపెయిన్ చేయనున్నట్టు మోడీ ప్రకటించారు.2014కి ముందు కరోనావైరస్ వ్యాప్తి చెందితే 60శాతానికి పైగా జనాభా బహిరంగ మలవిసర్జన చేయాల్సిన పరిస్థితులు.. ఆ సమయంలో ఇలాగే లాక్ డౌన్ విధించడం సాధ్యపడేదేనా? అని మోడీ చెప్పారు. పిల్లలను సామాజిక దూర నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు.కరోనావైరస్ నుండి రక్షణగా మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది గాంధీజీ స్ఫూర్తితో ‘స్వచ్ఛ భారత్ మిషన్’ను జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. దేశంలోని ప్రజలకు కేవలం 60 నెలల్లో 60 కోట్లకు పైగా మరుగుదొడ్డి సౌకర్యాన్ని అందించగలిగామని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

Related Posts