లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

కోవాగ్జిన్-కోవిషీల్డ్ : సీరం వ్యాక్సిన్ కన్నా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ధర చాలా తక్కువ!

Published

on

Covaxin vs Covishield : Bharat Biotech vaccine may cost less Serum: వ్యాక్సిన్లు వచ్చేశాయిగా.. కరోనా టెన్షన్ తీరినట్టే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కొద్ది రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే.. ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ సరసమైన ధరకే అందుబాటులోకి వస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ ధర చాలా తక్కువ అంట.. సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కంటే కోవాగ్జిన్ వ్యాక్సిన్ చాలా చీప్ అంట.. హైదరాబాద్ ఆధారిత బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అతి త్వరలో ప్రభుత్వంతో ఫైనల్ కాంట్రాక్ట్ కుదుర్చుకోనున్నట్టు సమాచారం. అయితే ఈ వ్యాక్సిన్ ధర ఎంత అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్ ధరకు సంబంధించి ప్రభుత్వంతో చర్చించేందుకు ఇంకాస్తా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

ఇతర వ్యాక్సిన్ పోటీదారుల కంటే అతి తక్కువ ధరకే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పూర్తిగా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై భారత్ బయోటెక్ మాత్రం స్పందించలేదు. ఇక సీరమ్ అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఒక డోస్‌కు ప్రభుత్వానికి రూ.200 చొప్పున ధరను నిర్ణయించనుంది. అలాగే ప్రైవేటు మార్కెట్లో రూ.1000లుగా వ్యాక్సిన్ ధరను నిర్ణయించనుంది.

2021 జనవరి 3వ తేదీన కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదించిన సంగతి తెలిసిందే. కోవాగ్జిన్ టీకా సమర్థతకు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ ఇంకా అందించలేదు. క్లినికల్ ట్రయల్ మోడ్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి లభించింది.