లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ప్లాస్మాథెరపీ సామర్థ్యంపై టెస్ట్…ట్రయిల్స్ కు ఢిల్లీ ILBSకు అనుమతులు

Published

on

Covid-19: Delhi’s ILBS gets nod for trials to test plasma therapy efficacy

క‌రోనా వైర‌స్ వ‌ల్ల తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ సైన్సెస్(ILBS)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.

క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి,ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి కోసం దాన్ని ఉపయోగిస్తారు. అది మనిషి శరీరంలోకి ప్రవేశించాక కరోనా వైరస్ పై పోరాటానికి రోగనిరోధక వ్యవస్థ ఓ యాంటీబాడీని సృష్టిస్తుంది. కరోనా వైరస్ శరీరంలో నుంచి వెళ్లిపోయాక కూడా యాంటీబాడీ శరీరంలోనే ఉంటుంది. కోలుకున్న పేషెంట్ల యాంటీబాడీస్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగుల‌ను బ‌తికించేందుకు సహాయం చేస్తుంది. కరోనా వైర‌స్‌ ను నాశ‌నం చేసేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేన‌ప్ప‌టికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందులు, యాంటీ మలేరియా డ్రగ్- హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల‌తో క‌రోనాను త‌గ్గిస్తున్నారు.

అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి మాత్రం ఈ మందులు ప‌నిచేయ‌డం లేదు. దీంతో అలాంటి వారికి ఈ విధానం ఉపయోగపడుతుందని,పలు ఇతర వైరల్ వ్యాధులకు ఈ విధానం ఉపయోగించినట్లు ILBS డైరక్టర్ డాక్టర్ సరిన్ తెలిపారు.  కరోనా సోకి కోలుకుని మరియు హై యాంటీ బాడీ లెవల్ కలిగి ఉన్న వాళ్ల నుంచి 300-500ML బ్లడ్ తాము తీసుకోనున్నట్లు డాక్టర్ సరిన్ తెలిపారు. ఈ రక్లం నుంచి ప్లాస్మా వేరు చేయబడుతుందని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో యాంటీబాడీ టెస్ట్ లు అందుబాటులో లేవని,యాంటీబాడీ టెస్టింగ్ కిట్ లను భారత్ తయారుచేయలేదని,దీంతో కరోనా పేషెంట్ యాంటీబాడీ లెవల్స్ కొలవడం అసాధ్యమని తెలిపారు. కోలుకున్న ఆరోగ్యకరమైన పేషెంట్లను మాత్రమే ఎన్నుకుంటున్నామని,వారికి మంచి ఇమ్యూనిటీ రెస్ఫాన్స్ ఉంటుందని తెలిపారు. క

కరోనా నుంచి కోలుకుని,దాతలుగా ముందుకొచ్చిన ఆరోగ్యకరమైన వ్యక్తులపైనే ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు. డయాబెటీస్,హైపర్ టెన్షన్ మరియు ఎటువంటి గుండెసంబంధిత వ్యాధులు దాతకు ఉండకూడదని,అంతేకాకుండా దాతలు 60ఏళ్ల లోపు వాళ్లు అయి ఉండాలని తెలిపారు. ఆరోగ్యకరమైన కరోనా పేషెంట్లు ప్రాణాపాయస్థితిలో ఉన్నవాళ్ల కోసం ముందుకురావాలని డాక్టర్ సరిన్ విజ్ణప్తి చేశారు. ప్లాస్మాథెరపీ విధానం  ఇప్ప‌టికే అమెరికా, చైనా సహా పలు దేశాల్లో ఉంది. అయితే దీనికి మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తి లేదన్న విషయం తెలిసిందే. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఇటీవల కేరళకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.  

ప్లాస్మా థెర‌పీలో… క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి ర‌క్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో క‌రోనా వ‌చ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ఈ విధానం ద్వారా రోగుల‌ను బ‌తికించేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే ప్లాస్మా థెర‌పీలో… ఒక వ్య‌క్తి నుంచి సేక‌రించే ప్లాస్మాతో రెండు డోసులు మాత్ర‌మే త‌యారు చేయ‌వ‌చ్చ‌ని ICMR తెలియ‌జేసింది. ఒక డోసు వ్య‌క్తికి స‌రిపోతుంద‌ని.. అయితే ప్లాస్మాను సేక‌రించేందుకు క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి వారిని ఒప్పించాల్సి ఉంటుంద‌ని.. ICMR తెలిపింది. ఇక అమెరికా, చైనాల‌లో ఇప్పటికే ఈ విధానం స‌క్సెస్ అయినందున‌.. మ‌న దేశంలోనూ దీన్ని ప్ర‌స్తుతం ప్రారంభించారు. అయితే ఈ విధానం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ది క‌నుక‌.. కేవ‌లం అత్య‌వ‌సర స్థితి ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు మాత్ర‌మే ఈ విధానంలో చికిత్స చేయ‌నున్నారు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *