రెండో ప్రపంచ యుద్ధం తర్వాత..అతి పెద్ద సవాల్ కోవిడ్ – 19 – మోడీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Covid-19 pandemic biggest challenge : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ కోవిడ్ – 19 అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జి 20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ Group of 20 Summit ప్రారంభించారు. కోవిడ్ – 19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వర్చువల్ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు.ఫలవంతమైన చర్చలు జరిగాయని, పాలనా వ్యవపస్థలో ఎక్కువ పారదర్శకత ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు త్వరగా కోలుకుంటాయానే ఆశాభావం వ్యక్తం చేశారు. వర్చువల్ సమ్మిట్ నిర్వహించినందుకు సౌదీ అరేబియాకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు. virtual G20 secretariat ఏర్పాటు చేయాలని సూచించారు. సమాజంలో సాంకేతికత అన్ని విభాగాలకు చేరుకొనేలా చూడడం, పారదర్శకత ఉండేలా చూడాలన్నారు.కరోనా వైరస్ కారణంగా..సవాళ్లు, అడ్డంకులు ఎదురైనా 2020లో రెండవ జి 20 సమ్మిట్ ను వర్చువల్ ఫార్మాట్ ద్వారా నిర్వహించినందుకు ప్రధాని మోడీ అభినందించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 19 సభ్య దేశాలు, EU, ఆహ్వానించబడిన ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, సంబంధిత రాష్ట్ర అధిపతులు ఇతరులు సమావేశంలో పాల్గొన్నారు. తీవ్రవాదం, వాతావరణ మార్పులు, నల్లధనం వెలికితీతలో అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం.

Related Tags :

Related Posts :