COVID-19 Patient's Body Dumped Outside Bhopal Hospital. Shocker On CCTV

కరోనా పేషెంట్ డెడ్ బాడీని రోడ్‌పై విసిరేశారు!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారి బంధాలనే కాదు.. మానవతా విలువలను మంటగలుపుతుంది. పేషెంట్ డెడ్ బాడీ నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అనే అనుమానంతో హాస్పిటల్ లోని పావ్‌మెంట్ నుంచి బయటకు విసిరేశారు. సోమవారం రాత్రి భోపాల్ లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ సెక్యూరిటీ సీసీటీవీ ఫుటేజిలో ఇదంతా రికార్డ్ అయింది. ఇద్దరు అంబులెన్స్ వర్కర్లు పీపీఈ సూట్ల ధరించి శవాన్ని బయటకు తీసుకువచ్చారు.

స్ట్రెచ్చర్‌పై నుంచే పేషెంట్‌ను పావ్‌మెంట్‌లో నుంచి తోసేశారు. ఘటనపై పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉద్యోగి మృతిపై పూర్తి ఇంక్వెరీ జరపాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. రెండు వారాల క్రితం కిడ్నీ కండీషన్ సరిగా లేక హాస్పిటల్ లో చేరిన వ్యక్తికి కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్య కూడా మొదలైంది. దీనిని న్యూమోనియాగా అనుమానించారు. సోమవారం సాయంత్రం COVID-19పాజిటివ్ అని వచ్చింది.

భోపాల్‌లోని పీపుల్స్ హాస్పిటల్‌లో కొవిడ్ టెస్టు పూర్తయిన తర్వాత ట్రీట్ మెంట్ జరిగింది. ఆ తర్వాత చిరాయు హాస్పిటల్ కు పంపించారు. ఆదివారం శాంపుల్స్ తీసుకుని టెస్టులకు పంపించగా సోమవారానికి పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. జనవరి నుంచి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.

అంబులెన్స్ లో ఏం జరిగిందో నాకు తెలియదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చిరాయు హాస్పిటల్ కు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు. ఇలా రోడ్ మీద పడేస్తే.. రెండు హాస్పిటల్స్ సమస్యలో పడినట్లే కదా. వారు మాకు ఎటువంటి సమాచారం అందించలేదని మృతుని కొడుకు ఆరోపించాడు.

మేం ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న ఒక అంబులెన్స్ ను పంపాలనుకున్నాం. వీఐపీ రోడ్ కు చేరాక డ్రైవర్ పేషెంట్ ను పికప్ చేసుకున్నాడు. ట్రాఫిక్ ఉండడంతో 45నిమిషాల సమయంలోనే చిరాయు హాస్పిటల్ కు చేరుకున్నాం. పీపుల్స్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడినాక అంబులెన్స్ వెనక్కి తిరిగిపోయింది అని చిరాయు హాస్పిటల్ డైరక్టర్ అజయ్ గోయెంకా అన్నారు.

Read Here>>872 మంది రైల్యే ఉద్యోగులకు కరోనా పాజిటివ్

Related Posts