లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

కరోనా నుంచి కోలుకున్నవారిలో కొత్త సమస్య : 6 నెలల వరకు వైరస్ లక్షణాలు పోవంట!

Published

on

COVID-19 symptoms linger least 6 months : ప్రపంచమంతా కరోనావైరస్ వ్యాపించి ఉంది. మన భూమిమీద ఎక్కడికి వెళ్లినా కరోనా వైరస్ విస్తరించి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందిలో కరోనా ఎప్పుడు వచ్చిపోయిందో కూడా తెలియని పరిస్థితి. కరోనా టెస్టు చేయించుకుంటే తప్పా కరోనా ఉందనే సంగతి తెలియడం లేదు. కరోనా సోకిన తర్వాత కోలుకున్నవారిలో ఓ కొత్త సమస్య వెంటాడుతోంది.

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వారిలో వైరస్ లక్షణాలు 6 నెలల వరకు అలానే ఉంటాయని వుహాన్ కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనాతో ఆస్పత్రిలో మొదటగా చేరిన కొంతమంది నమూనాల ఆధారంగా వుహాన్ రీసెర్చర్లు అధ్యయనం చేశారు. ఇందులో కరోనా లక్షణాలు కనీసం 6 నెలల వరకు అంతర్గతంగా ఉంటాయని కనుగొన్నారు. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ సిటీలో కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన 1,733పై అధ్యయనం చేశారు.

కరోనా లక్షణాలు బయటపడకముందే చాలామంది ఆస్పత్రిలో చేరారు. మొత్తంగా మూడు త్రైమాసికాలుగా కరోనా పేషెంట్లను విభజించారు. వారిలో కరోనా సోకినట్టు నిర్ధారణ అయినప్పటి నుంచి కనీసం 6 నెలల పాటు వైరస్ లక్షణాలు అలానే ఉన్నాయంట. 63శాతం కరోనా బాధితుల్లో ఇంకా అలసట లేదా కండరాల బలహీనత లక్షణాలు ఉండగా.. 23శాతం మందిలో ఆందోళన లేదా తీవ్ర ఒత్తిడి, మరో 26 శాతం మందిలో నిద్రలేమి వంటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక దాదాపు ఎక్కువమంది కరోనా బాధితుల్లో కనీసం కొన్ని నెలల పాటు వైరస్ లక్షణాలతో బాధపడినట్టు పరిశోధకులు తమ అధ్యయనంలో విశ్లేషించారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరినవారంతా కరోనా బాధితులుగా నిర్ధారించలేమని, వారిలో మరో అనారోగ్య సమస్యకు దారితీసి ఉండొచ్చునని అంటున్నారు. కరోనా తీవ్ర లక్షణాలతో బాధపడినవారిలో ఆరు నెలల తర్వాత కూడా శ్వాసపరమైన సమస్యలను ఎదుర్కొన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.