Covid-19: TANA offers accommodation to Indian students in US

కరోనా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన తానా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ తన ప్రభావం చూపిస్తుంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే అమెరికాలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది అక్కడి ట్రంప్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే జనసంచారం తిరుగుతుంది అనుకునే ప్రతి ప్రదేశాన్ని మూసివేశారు. ఆఫీసులు.. స్కూళ్లు.. సినిమా హాళ్లు ఇప్పటికే షట్‌డౌన్‌ అయ్యాయి. దీంతో భారత విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.

యూఎస్‌లో  ఎమ్మెస్ చదవడానికి, అక్కడ ఉద్యోగాలు చెయ్యడానికి వెళ్లిన మనవాళ్లు ఎలా ఉన్నారు? ఎలాంటి సౌకర్యాలు పొందుతున్నారు? అనే కంగారు ఇండియాలో ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) రంగంలోకి దిగింది. కరోనా ముప్పు నుంచి భారతీయులను కాపాడేందుకు కృషి చేస్తున్న తానా(TANA) ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ని ఏర్పాటు చేసింది.

వాలంటీర్ల సహకారంతో ఇండియన్స్‌కు ఎలాంటి అసౌకర్యం జరగకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 24X7 హెల్ప్‌లైన్‌ ద్వారా సాయం అందిస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 3,777 మందికి కరోనా వైరస్‌ సోకగా.. వీరిలో 69 మంది చనిపోయారు. అమెరికా ప్రభుత్వం నివారణా చర్యలను వేగవంతం చేసింది. మనదేశానికి చెందిన 2.5 కోట్ల మంది విద్యార్థులు అక్కడి 3009 యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు.

వారందరినీ క్షేమంగా ఉంచేందుకు తానా తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. సేవా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ కూడా కరోనాను కట్టడి చేసేందుకు ముందుకొచ్చింది.  కరోనా కట్టడి కోసం 10,000 డాలర్లను సహాయనిధికి అందజేసింది.
 

Related Posts