Telangana COVID కేసుల వివరాలు, జిల్లాల వారీగా.. 2 వేల 043 కొత్త కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

COVID samples : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 1,802 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,35,357గా ఉంది. ఒక్క రోజులో 11 మంది చనిపోయారని వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 81.02 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.60గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 30 వేల 673గా ఉందని, నివాసాలు / సంస్థల ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారు 24 వేల 081గా తెలిపింది.

భారత్‌లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు


ఒక్క రోజులో 50 వేల 634గా పరీక్షలు నిర్వహించినట్లు, మొత్తం పరీక్షల సంఖ్య 23 లక్షల 79 వేల 950గా ఉందని తెలిపింది.
సాధారణ పడకలు 12 వేల 284 అందుబాటులో ఉన్నాయని, 334 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 11 వేల 950 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.ఆక్సిజన్ పడకలు 05 వేల 561 అందుబాటులో ఉన్నాయని, 1, 391 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 04 వేల 470 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.

ఐసీయూ పడకలు 02 వేల 251 అందుబాటులో ఉన్నాయని, 739 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 01 వేల 512 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 19. భద్రాద్రి కొత్తగూడెం 49. జీహెచ్ఎంసీ 314. జగిత్యాల 42. జనగామ 25. జయశంకర్ భూపాలపల్లి 23. జోగులాంబ గద్వాల 17. కామారెడ్డి 31. కరీంనగర్ 114. ఖమ్మం 84. కొమరం భీం ఆసిఫాబాద్ 20. మహబూబ్ నగర్ 26. మహబూబాబాద్ 74. మంచిర్యాల 25. మెదక్ 25. మేడ్చల్మల్కాజ్ గిరి 144. ములుగు 16. నాగర్ కర్నూలు 32. నల్గొండ 131. నారాయణపేట 12. నిర్మల్ 16. నిజామాబాద్ 65. పెద్దపల్లి 48. రాజన్న సిరిసిల్ల 46. రంగారెడ్డి 174. సంగారెడ్డి 71. సిద్దిపేట 121. సూర్యాపేట 51. వికారాబాద్ 20. వనపర్తి 22. వరంగల్ రూరల్ 33. వరంగల్ అర్బన్ 108. యాదాద్రి భువనగిరి 45. మొత్తం : 2043
open_record_view

Related Posts