దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ సెంటర్లు రెడీ.. వచ్చే నెలలోనే టీకా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Covid-19 vaccine centres ready: దేశవ్యాప్తంగా కరోనా టీకా అందించేందుకు వ్యాక్సిన్ సెంటర్లను NHS సిద్ధం చేస్తోంది. యూకేలో కరోనా టీకా వేసేందుకు అవసరమైన అన్ని వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య కార్యదర్శి మ్యాట్ హ్యాన కాక్ ఒక ప్రకటనలో తెలిపారు.దేశంలో పలు ఆస్పత్రులతో పాటు పలు జీపీఎస్ కమ్యూనిటీల్లోనూ వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు టీకా అందించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే పైజర్-బయోంటెక్ వ్యాక్సిన్‌కు మెడికల్ రెగ్యులేటర్ నుంచి అనుమతి కోసం ప్రభుత్వాన్ని అధికారికంగా కోరినట్టు ఆయన తెలిపారు.

ఒకవేళ రెగ్యులేటర్ ఆమోదం తెలిపితే మాత్రం వచ్చే నెలలోనే వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని అన్నారు. కానీ, పెద్దమొత్తంలో వ్యాక్సినేషన్ కొత్త ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. యూకేలో మరో 20,252 కరోనా కేసులు నమోదు కాగా, మరో 511 మంది మరణాలు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో NHS కరోనా వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఎందుకంటే.. పైజర్-బయోంటెక్ వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. లాజిస్టికల్‌గా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని NHS భావిస్తోంది.

ఎన్‌హెచ్ఎస్ స్టాఫ్ కోసం ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాదిలో భారీ స్థాయిలో బల్క్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఈ రెండు మార్గాల్లో అమలు చేయాలని భావిస్తోంది. స్పోర్ట్స్ హాల్స్ వంటి ప్రదేశాల్లోనూ వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియ చాలా కష్టతరంగా ఉంటుంది.అందుకే NHS రంగంలోకి దిగుతోంది. వేగవంతంగా వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే Pfizer/BioNTech, Sputnik, Moderna మూడు వ్యాక్సిన్లకు మూడో దశ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి.ఇందులో పైజర్ వ్యాక్సిన్ 65ఏళ్లు పైబడినవారిపై పరీక్షించగా.. 94శాతం వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తుందని ముందుగా తమ డేటాను వెల్లడించింది. ఆ తర్వాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన మరో వ్యాక్సిన్ రెండో దశలో ఫలితాలు సానుకూల ఫలితాలే వచ్చాయి.ఇప్పటికే యూకే ప్రభుత్వం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ 100 మిలియన్ల డోస్‌లను ఆర్డర్ చేసింది. పైజర్-బయోంటెక్ వ్యాక్సిన్ 40 మిలియన్ల డోస్ లను ఆర్డర్ చేయగా, మోడెర్నా వ్యాక్సిన్ 5 మిలియన్ల డోస్ లను ఆర్డర్ చేసింది.

Related Tags :

Related Posts :