కరోనా వైరస్ కు చైనా మందు రెడీ అయినట్లే..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది చైనా. మందు తయారుచేయడంలోనూ ప్రపంచంతో పోటీపడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ఫలితాల ప్రకారం.. తాము అభివృద్ధి చేసిన కరోనావ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలుత మనుషులపై ప్రయోగించిన వ్యాక్సిన్‌ ద్వారా అది సురక్షితమైందని నిర్ధారణ అయింది.

బీజింగ్‌లో తయారు చేసిన రెండో వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ ప్రోత్సాహకర ఫలితాలను ఇచ్చింది. ఈ టీకాను తొలిదశ 1/2 క్లినికల్‌ ట్రైల్స్‌లో వెయ్యి 120 మందికి ఇచ్చారు. వీరందరిలో యాంటీబాడీస్‌ను ఆ టీకా తయారు చేసిందని పేర్కొంది. ఈ విషయాన్ని సీఎన్‌బీజీ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ వుయ్‌ఛాట్‌లో పోస్టు చేసింది.

అదనపు సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. వూహాన్‌లో ఇదే సంస్థకు చెందిన మరోశాఖలో అభివృద్ధి చేసిన ఇంకో టీకా కూడా మనుషుల్లో యాంటీబాడీస్‌ను ఉత్పత్తి జరిగేట్లు చేస్తోందని పేర్కొంది. ఇప్పటికే చైనా అభివృద్ధి చేసిన పలు టీకాలను మానవులపై ప్రయోగించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఇక మూడో దశ ప్రయోగాల కోసం భారీ సంఖ్యలో వాలంటీర్లను నియమించుకుంటోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కూడా ఈ టీకా మూడో దశ ప్రయోగాలు నిర్వహించనుంది. కచ్చితంగా ఈ టీకా క్యాండెడేట్‌ను ప్రయోగిస్తోందో మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ సక్సెస్ అయితే మరి కొద్ది రోజుల్లోనే కరోనాకు పర్మినెంట్ మెడిసిన్ దొరకడం ఖాయం.

Related Posts