పైజర్ వ్యాక్సిన్ షాట్లన్నీ కేంద్రం సేకరించక పోవచ్చు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pfizer shots Covid-19 vaccine : కరోనాను అంతం చేయడంలో ఫైజర్ వ్యాక్సిన్ 90శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడైంది. కానీ, ఈ పైజర్ వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పైజర్ వ్యాక్సిన్ స్టోరేజీ అవసరం అనేది క్లిష్టమైన చర్యగా మారింది.అందుకే ఈ విషయంలో కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఆందోళనగా ఉంది. ప్రస్తుతం భారతదేశ జనాభాకు తగినంత మొత్తంలో పైజర్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. NIT అయోగ్ సభ్యులు (హెల్త్) వికె పాల్ నేతృత్వంలో కోవిడ్-19 కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

కానీ, పైజర్ వ్యాక్సిన్ కు రెగ్యులేటరీ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈలోపు కేంద్రం కూడా వ్యాక్సిన్ సేకరణతోపాటు పంపిణీకి సంబంధించి వ్యూహాత్మక అమలు చేయాలని భావిస్తోంది.

చైనా కరోనా వ్యాక్సిన్ కూడా సురక్షితమేనంట.. వాలంటీర్లలో ఇమ్యూనిటీని పెంచింది


పైజర్ వ్యాక్సిన్ స్టోరేజీ విషయంలో ఇబ్బందులు కేవలం ఒక భారతదేశంలో మాత్రమే కాదు.. చాలా దేశాల్లోనూ పైజర్ వ్యాక్సిన్ స్టోరీజిపై అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య తలెత్తుతోందని వైద్య నిపుణులు అంటున్నారు.ఇప్పటికే మోడెర్నా, పైజర్ రెండూ త ప్రాథమిక ట్రయల్ ఫలితాలను వెల్లడించాయి. రెగ్యేలేటరీ నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 5 కరోనా వ్యాక్సిన్లపై వేర్వేరు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఈ ఐదు వ్యాక్సిన్లలో రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటీస్ భాగస్వామ్యంలో వచ్చే వారం నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.భారత్ బయోటెక్ స్వదేశీ కోవాక్సిన్, సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ Covishield, జిందాస్ కాడిలా ZyCoV-D, మరో వ్యాక్సిన్ బయోలాజికల్ E.Ltd అభివృద్ధి చెందుతోంది.

వీటితో పాటు బేలర్ కాలేజీ మెడిసిన్ డైనవాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్ కూడా ఈ వ్యాక్సిన్ జాబితాలో ఉంది. గతవారమే పైజర్, బయోటెక్ కంపెనీలు తమ కరోనా వ్యాక్సిన్ 90 శాతం ప్రభావంతంగా పనిచేస్తాయని ప్రకటించింది.మోడెర్నా కూడా తమ వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, సాధారణ ఉష్ణోగత్రలోనే స్టోరేజీ అవసరం ఉంటుందని తెలిపింది. పైజర్ వ్యాక్సిన్ తప్పనిసరిగా 70 డిగ్రీల సెల్సియస్ లో మాత్రమే స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సింథటిక్ mRNA ద్వారా వైరస్ నుంచి రోగనిరోధకత వ్యవస్థను బలపరుస్తుంది.

Related Tags :

Related Posts :