కరోనా వ్యాక్సిన్‌పై బాంబు పేల్చిన కేంద్రం.. ఈ యేడు టీకా రానట్టే..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది? ఈ ఏడాది చివరికి టీకా వచ్చేనా? భారత్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇంతకు టీకా ఎప్పుడు వస్తుందని కేంద్రం చెబుతుంది? కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం బాంబు పేల్చింది. రెండు మూడు నెలల్లో.. లేదంటే ఈ ఏడాది చివరికో టీకా వస్తుందని భారతీయ ప్రజలంతా భావిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం కరోనా మందు అనుకున్న సమయానికి రావట్లేదన్న నిజాన్ని బయటపెట్టింది.కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేశారు. 2021 మొదటి త్రైమాసికంలోనే వ్యాక్సిన్‌ వస్తుందని ఆయన ప్రకటించారు. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన ‘సండే సంవాద్‌’ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. దానికి వాలంటీర్‌గా వ్యవహరిస్తానన్నారు. టీకా విడుదలైన వెంటనే మొదట ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అత్యవసరం అయిన వారికి ఖర్చుతో సంబంధం లేకుండా పంపిణీ చేస్తామని తెలిపారు.

COVAXIN : కోవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు – భారత్ బయోటెక్


టీకాకు మరో ఆరు నెలల సమయం
కరోనా వ్యాక్సిన్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వారి ఆశలపై హర్షవర్ధన్‌ ప్రకటన నీళ్లు పోసింది. అంటే… హర్షవర్ధన్‌ ప్రకటన ప్రకారం… మరో ఆరు నెలలపాటు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలు లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలోగానే వ్యాక్సిన్‌ వస్తుందని అందరూ భావించారు. భారత్‌లో ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు ప్రయోగ దశలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశతో ఎదరుచూస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం మాత్రం ఇప్పుడే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చింది.కరోనా కేసుల్లో రెండో స్థానంలో భారత్‌
భారత్‌లో కరోనా దూకుడు కొనసాగుతోంది. రోజుకు 80వేల పైనే కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా 90వేలు దాటాయి. ఇలా రోజుకు కేసులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా కేసుల్లో భారత్‌దే మొదటిస్థానం. అమెరికా, బ్రెజిల్‌కు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల్లో మనం రెండోస్థానంలో ఉన్నాం. ఇదే దూకుడు కొనసాగితే మరో 20రోజుల్లో అమెరికాను మించిపోవడం ఖాయం. ఓవైపు కేసులు పెరుగున్నాయి.మరోవైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలించేశారు. స్కూళ్లు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అందరూ వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆ అవకాశం లేదని తేలిపోయింది. మన వ్యాక్సిన్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కూడా కొనసాగుతున్నాయి. మూడో దశను పూర్తి చేయాలంటే అందుకు ఇంకొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో వ్యాక్సిన్‌ కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి. రష్యా వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ అది మూడోదశ టెస్టులు చేయలేదు.


కోవిడ్‌ బాధితులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారితో పోరాడుతున్నవారికి కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిలాంటి సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది. ఎప్పటిలాగే మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి అని పేర్కొంది. తగినంత గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలని సూచించింది.

READ  ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్

Related Posts