రష్యా వ్యాక్సిన్ పంపిణి మొదలైంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వ్యాక్సిన్ కోసం దాదాపు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుండగా, రష్యా తన దేశంలోని సామాన్య పౌరులకు వ్యాక్సిన్ సప్లిమెంట్లను ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల, రష్యా ప్రపంచంలోని మొదటి కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్-వి’ మొదటి బ్యాచ్‌ను సాధారణ పౌరులకు విడుదల చేసింది. అయితే ఇప్పుడు రష్యా 2020-2021లోపు ఒక బిలియన్ కంటే ఎక్కువ టీకాలు వేస్తామని ప్రకటించింది. అంటే 100 కోట్ల మందికి ఈ టీకాను ఇచ్చే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే నేటి(14 సెప్టెంబర్ 2020) పౌరులకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది రష్యా. సోమవారం నాటికి రష్యాలోని అన్ని ప్రాంతాలకు తొలి బ్యాచ్‌ స్పుత్నిక్‌-వీ టీకాలు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురషుకో వెల్లడించారు. ఇప్పటికే టీకాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పంపిణీ ఎలా సాగుతున్నదో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు పంపిణీ చేసేందుకు తొలిబ్యాచ్‌ టీకాలను రష్యా ప్రభుత్వం వారంక్రితం విడుదల చేయగా.. ప్రపంచంలో సామాన్యులకు మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్ రష్యాదే కావడం విశేషం.ఇదిలా ఉంటే.. కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ -5’ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి రష్యా ప్రభుత్వం భారత్‌తో చర్చలు జరుపుతోంది. రష్యన్లు తమ టీకా గరిష్ట ఉత్పత్తి కోసం భారతదేశ పారిశ్రామిక సౌకర్యాలు మరియు సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.

బ్రిటన్ లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ‌ట్రయల్స్ మళ్ళీ షురూ


అదే సమయంలో, భారతదేశం కూడా టీకీ ప్రయోజనం గురించి ఆలోచిస్తోంది. భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్‌పై జాతీయ నిపుణుల బృందం అధిపతి, ఎన్‌ఐటిఐ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ, రష్యాకు మంచి భారత్ పెద్ద మొత్తంలో (స్పుత్నిక్ -5) వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలదని చెబుతున్నారు. కరోనాను దేశంలో కట్టడి చెయ్యడానికి భారతదేశానికి ఇదొక గొప్ప అవకాశం.Related Posts