ప్రతిఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయాలంటే.. 2024 వరకు ఆగాల్సిందే..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Covid-19 vaccines available till 2024 : ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది.. కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువ కావడంతో కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను అంతం చేయగల ఆయుధం ఒకటే.. Covid-19 Vaccine.. ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.. కొన్ని కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం ఇప్పట్లో అసాధ్యమనే చెప్పాలి..2020 ఏడాది ఆఖరులో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యమో చెప్పలేని పరిస్థితి.. రష్యా మొదటి కరోనా వ్యాక్సిన్ ‘Sputnik V’ ప్రవేశపెట్టినప్పటికీ.. సమర్థవంతంగా పూర్తిస్థాయిలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.. ఒకటి అరా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ తగినంత స్థాయిలో వ్యాక్సిన్లు ఉండకపోవచ్చు.. 15 బిలియన్ల డోస్‌లు అవసరం పడొచ్చు:
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాలంటే మాత్రం ఇప్పట్లో సాధ్యపడేది కాదు.. 2024 వరకు వేచి చూడాల్సిందే.. అప్పుడే తగినంత స్థాయిలో కరోనా వ్యాక్సిన్లను ప్రపంచమంతా వేయడానికి సాధ్యపడుతుంది.. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురావాలంటే 15 బిలియన్ల డోస్ లు అవసరం పడుతుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ Serum Institute of India చెబుతోంది. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్లు అతి తక్కువ సమయంలో అందుబాటులోకి తీసుకురావడం అసాధ్యం అంటున్నారు నిపుణులు..

బీ రెడీ.. నవంబర్ 1 కల్లా కరోనా వ్యాక్సిన్, పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ట్రంప్ సందేశం


ఒక వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది.. విజయవంతగా ట్రయల్స్ పూర్తి చేసుకున్నాక కొన్నాళ్ల వరకు దానిపై మరిన్ని ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది.. ఆ వ్యాక్సిన్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేయగలదో స్పష్టమైన అవగాహన ఉండి తీరాల్సిందే.. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది.. ఈ వ్యాక్సిన్ కారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు.. అప్పటివరకూ ఈ వ్యాక్సిన్లపై పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది.. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్థలు కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నాయి.2021లో వ్యాక్సిన్ సాధ్యమేనా?.. మరో నాలుగైదేళ్లు పట్టొచ్చు.. :
ఈ వ్యాక్సిన్లలో ఏ ఒక్కటి పరిమిత కాలం కంటే ముందే అందుబాటులోకి వచ్చినా దాని మోతాదులను అందరికి ఇవ్వడానికి సాధ్యపడదు.. ఎవరికి ముందు ఇవ్వాలి? ఎవరికి చివరిగా ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి 2021 మొదటి త్రైమాసికంలో వస్తుందని అంటున్నారు. ఒకవేళా వచ్చినా ప్రతిఒక్కరికి పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే 2021లోనూ సాధ్యపడదు.. ఒక వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో 12 నుంచి 18 నెలల సమయం పడుతుంది.. ప్రతిఒక్కరికి సరైన మోతాదులో కరోనా వ్యాక్సిన్ అందాలంటే మాత్రం మరో నాలుగైదేళ్ల సమయం తప్పక పడుతుందని అంటున్నారు.రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే మార్గం :
ఒకవేళ రెండు డోస్‌ల వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చినా కూడా.. ప్రపంచం మొత్తం 1500 కోట్ల వ్యాక్సిన్‌లు అవసరం ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చునని చెబుతున్నారు. అంటే.. 2024 వరకు కరోనా వ్యాక్సిన్ కోసం వేచిచూడాల్సిందే మరి..

READ  బడ్జెట్ తయారీ : హల్వాతోనే ఎందుకు మొదలుపెడతారు

అప్పటిదాకా కరోనా బారినుంచి ఎలా బయటపడాలంటే.. ప్రస్తుతం పాటిస్తున్న ముఖానికి మాస్క్, సామాజిక దూరం, శానిటైజేషన్ వంటి నియమాలు పాటిస్తూనే.. వ్యాధి నిరోధకతను పెంచుకునే దిశగా ప్రయత్నించాలంటున్నారు నిపుణులు.. ప్రతిఒక్కరిలోనూ బలమైన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే.. ఎలాంటి వైరస్ లనుంచైనా మనల్ని మనం కాపాడుకోవచ్చునని అంటున్నారు.. మెడిసిన్ లేని వైరస్‌లతో పోరాడాలంటే రోగ నిరోధకత పెంచుకోవడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు..

Related Posts