Covid 19 Virus Moderna Biotech Company

Good News : Covid – 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికాలోని మోడెర్నా అనే బయోటెక్ సంస్థ కరోనాకి వేక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. తొందర్లోనే దీన్ని టెస్ట్ చేయబోతున్నట్లు కూడా ఈ సంస్థ ప్రకటించింది. కరోనా కల్లోలానికి అమెరికా దేశంపై తక్కువ ప్రభావమే పడినప్పటికీ చైనా దేశంపై మండిపడుతోంది. ఈ క్రమంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనానే ఈ వైరస్‌ని నిర్లక్ష్యం చేసిందని..అసలు ఈ వైరస్ పుట్టుక వెనుక కూడా ఆ దేశం హస్తమే ఉందంటూ అమెరికా మీడియా స్టోరీలు రాశాయి. అనూహ్యంగా కరోనాకు అమెరికా వ్యాక్సిన్ తయారు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

మరోవైపు చైనా నుంచి మిడిల్ఈస్ట్‌కి పాకిన కరోనా ధాటికి కనీసం 42 దేశాలు అల్లాడుతున్నాయి. వాటిలో ఇరాన్ దేశం కూడా ఒకటి. ఏకంగా అక్కడి ఆర్ధికమంత్రి ఇరాజ్ హారిర్చీకి కరోనా టెస్ట్‌లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది..దీంతో తాను కరోనాపై పోరాడి గెలుస్తానంటూ చెప్పారాయన. ఇరాజ్‌ని ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఐసోలేషన్ వార్డ్‌లో చికిత్స చేస్తోంది.

ఇక చైనా పక్కనే ఉన్న సౌత్ కొరియాలో కరోనా విలయతాండవానికి సిద్ధమైన సంకేతాలు వస్తున్నాయి. ఒక్క బుధవారమే ఇక్కడ 169 కేసులు నమోదయ్యాయి. దీంతో సౌత్ కొరియాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1146కి చేరింది. దేశంలోనే అతి పెద్ద సిటీ అయిన డేగూలో వైరస్ కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. కోవిడ్ 19 ప్రభావంతోనే మార్చి 22 నుంచి ఇక్కడ ప్రారంభం కావాల్సి ఉన్న టేబుల్ టెన్నిస్ ప్రపంచ కప్ పోటీ వాయిదా వేసారు. 

ఇరాన్ మీదుగా ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, అఫ్గనిస్తాన్‌కి వ్యాపించిన వైరస్ దెబ్బకి దేశాల సరిహద్దులను మూసివేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా. లెబనాన్ దేశాలు తమ ప్రాంతాల్లో వైరస్ కేసులకు ఇరాన్ దేశమే కారణమంటూ మండిపడుతున్నాయి. ఈ దేశాల్లో ఇరాన్ రానున్న రోజుల్లో బాగా ప్రభావితం అయ్యే 
ఛాన్స్‌లున్నాయి.

అసలే అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోన్న ఇరాన్, కరోనా ముప్పును ఎదుర్కోవడం కష్టమనే ఆందోళన నెలకొన్నది. మరోవైపు కరోనా భయం కారణంగా ఇరాన్ పొరుగు దేశాలైన టర్కీ, ఆర్మేనియా, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ సరిహద్దులను మూసేశాయి. ఇరాన్‌లో కరోనా మరణాలు చోటుచేసుకోవడం, బాధితుల సంఖ్య పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్, సౌదీ, యూఏఈలు ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపేశాయి.

చైనాతో గట్టి వాణిజ్య సంబంధాలున్న ఇరాన్.. ఆ దేశం నుంచి రాకపోకలను మాత్రం నిలిపేయలేదు. ఇక ఇటలీలోనూ ఇటలీలోనూ 162 మందికి కోవిడ్ 19 మహమ్మారి సోకినట్లు  నిర్ధారణ అయ్యింది. చైనా పర్యాటకులపై విధించిన నిషేధాన్ని న్యూజిలాండ్‌ మరో వారం రోజులు పొడిగించింది. ఎనిమిది రోజుల పాటు చైనా పర్యాటకులు దేశంలోకి రాకుండా ఆంక్షలు విధించినట్లు న్యూజిలాండ్ ప్రకటించింది.

Read More : కరోనా వైరస్ : కర్నూలు జ్యోతి వచ్చేస్తోంది