దేశంలో కరోనా ఇంకా తీవ్రస్థాయికి చేరుకోలేదు: ఎయిమ్స్ డైరెక్టర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. ప్రతిరోజూ 50వేల నుంచి 55 వేల కొత్త కేసులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, డాక్టర్ రణదీప్ గులేరియా ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. కేసులు మరింత వేగంగా పెరుగే అవకాశం ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు.

కరోనా మహమ్మారిని నియంత్రణకి ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సభ్యుడైన డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. దేశంలో వ్యాక్సిన్ (టీకా) ను అభివృద్ధి చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలని ప్రపంచంలోని 60 శాతం టీకాలు ఇక్కడ తయారవుతుండగా.. పెద్ద సంఖ్యలో టీకాలు తయారు చేసే సామర్థ్యం మనకు ఉందని ఆయన అన్నారు.

ప్రభుత్వం మరియు వ్యాక్సిన్ తయారీదారులు కూడా దీనిని తయారు చేసే సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా ఇది మన దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లపై ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. అదేవిధంగా, భారత్ బయోటెక్ మరియు జైడస్ కాడిలా కంపెనీ కూడా వేర్వేరు టీకాలను అభివృద్ధి చేశాయి. అదే సమయంలో, అనేక దేశాల ఉమ్మడి ప్రయత్నాల్లోలు టీకా అభివృద్ధి చేస్తున్నాయి.

ఇక రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై డాక్టర్ గులేరియా మాట్లాడుతూ, టీకా సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవాలి. వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు పరీక్షించబడుతుంటే, వారి భద్రత చాలా ముఖ్యమైన విషయం. చెప్పిన టీకా ఎంత రక్షణ కల్పిస్తుందో లేదా ప్రభావవంతంగా ఉందో చూడాలని అన్నారు.

Related Posts