75శాతం కొత్త కేసులు ఆ 10రాష్ట్రాల్లోనే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 80పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, గడిచిన 24గంటల్లో 86,508 కేసులు నమోదు కాగా… నమోదయిన కేసుల్లో 75శాతానికి పైగా 10రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం.

అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదవగా, తర్వాత స్థానంలో కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,ఉత్తరప్రదేశ్,తమిళనాడు,ఢిల్లీ,ఒడిశా,కేరళ,వెస్ట్ బెంగాల్,ఛత్తిస్ గఢ్,లలో నమోదయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.


అదేవిధంగా, బుధవారం(సెప్టెంబర్-23,2020)కరోనాతో 1129 మరణించగా…. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్,పంజాబ్,తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్, కర్ణాటక,ఢిల్లీ,హర్యానాలలోనే 83శాతం మరణాలు నమోదయినట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 479మంది కరోనాతో మరణించారు.

నిన్నటివరకు,దేశవ్యాప్తంగా 6. 74కోట్లకు పైగా శాంపిల్ లు పరీక్షించగా… 57లక్షల 32వేల 518మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో 91,149మంది ప్రాణాలు కోల్పోగా.. 46లక్షల 74వేల 987మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

Related Posts