రెండోసారి కొవిడ్ ఇన్ఫెక్షన్.. మరింత ప్రమాదకరమైన లక్షణాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Covid ఇన్ఫెక్షన్ ఓ వ్యక్తికి రెండోసారి వ్యాపించింది. డాక్టర్ రిపోర్టుల ప్రకారం.. రెండోసారి Covid ఇన్ఫెక్షన్ రావడం మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఆ 25ఏళ్ల వ్యక్తి శరీరానికి సరిపడ ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులు అందజేయలేవని కచ్చితంగా హాస్పిటల్ ట్రీట్‌మెంట్ కావాల్సిందేనని వైద్యులు అంటున్నారు.

రీ ఇన్ఫెక్షన్లు అనేవి చాలా అరుదుగా జరుగుతాయని.. ప్రస్తుతం అతను రికవరీ అయ్యాడని చెప్తున్నారు. వైరస్ తర్వాత ఎంత ఇమ్యూనిటీ డెవలప్ అయిందనే దానిపై సందేహాలు మొదలయ్యాయి. అయితే నెవడాలో ఉండే ఈ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు లేదా ఇమ్యూన్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి.తేదీల వారీగా:

అసలు అతని ఆరోగ్య పరిస్థితి తేదీల వారీగా ఎలా ఉందో.. ఓ కన్నేద్దాం.
25 మార్చి – తొలిసారి లక్షణాలు కనిపించాయి. గొంతు నొప్పి, దగ్గు, వికారం, తలనొప్పి, విరేచనాలు
18 ఏప్రిల్ – తొలిసారి పాజిటివ్ అని కన్ఫామ్ అయింది.
27 ఏప్రిల్ – లక్షణాలు పూర్తిగా కనిపించకుండాపోయాయి.
9 & 26 మే – రెండుసార్లు నెగెటివ్ అనే వచ్చింది.
28 మే – రెండోసారి లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. ఈ సారి జ్వరం, తలనొప్పి, శ్వాస అందకపోవడం, దగ్గు, వికారం, మైకం లాంటివి కనిపించాయి.
5 జూన్ – రెండోసారి పాజిటివ్ వచ్చింది. శ్వాస అందకపోవడం (లో బ్లడ్ ఆక్సిజన్) సమస్య వచ్చింది.

సైంటిస్టులు పేషెంట్ కు కరోనావైరస్ రెండోసారి వచ్చినట్లు తేల్చేశారు. ఒరిజినల్ ఇన్ఫెక్షన్ కంటే ఇది బౌన్సింగ్ అయి వచ్చింది కాబట్టి మరింత ప్రమాదకరమని తేల్చారు.

‘మా అంచనా ప్రకారం.. భవిష్యత్ లో రానున్న ఇన్ఫెక్షన్ కు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేమని’ నెవడా యూనివర్సిటీకి చెందిన డా. మార్క్ పాండోరి అంటున్నారు. ‘COVID రీ ఇన్ఫెక్షన్లకు ఉన్న పాజిబిలిటీని గుర్తించేందుకు కొవిడ్ ఇమ్యూనిటీని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.

నిర్లక్ష్యం చేయొద్దు:

అందుకే కరోనా నుంచి కోలుకున్న వారు కూడా గైడ్ లెన్స్ ను, సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్క్ లు, హ్యాండ్ వాషింగ్ వంటివి తప్పకుండా పాటించాలని చెప్తున్నారు. ఇప్పటికీ కరోనావైరస్ ఇమ్యూనిటీని సరిగ్గా కాలిక్యులేట్ చేయలేకపోతున్నారు వైద్యులు.

ప్రతిఒక్కరూ సేఫ్ అయ్యారా..? చాలా తక్కువ లక్షణాలు కనిపించిన వారి పరిస్థితి ఏంటి..? ఆ ప్రొటెక్షన్ అనేది ఎంతకాలం పనిచేస్తుంది..? అనే ప్రశ్నలు సైంటిస్టులను వేధిస్తున్నాయి. 37మిలియన్ కన్ఫామ్ కేసుల్లో చాలా తక్కువ మాత్రమే రీ ఇన్ఫెక్షన్ అయింది.

అక్కడ ఇబ్బందేం లేదు:

హాంకాంగ్, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో రెండోసారి నమోదైన కేసులు మొదటి దాని కంటే ప్రమాదకరంగా లేవని తేల్చారు. ఈక్వెడార్ లో మాత్రం ఒక వ్యక్తికి రీ ఇన్ఫెక్షన్ వచ్చి మొదటి సారి కంటే తీవ్రంగా ఇబ్బందిపడ్డాడని, కాకపోతే హాస్పిటల్ ట్రీట్‌మెంట్ అవసరం లేకుండానే నయం అయిందని రిపోర్టులు చెబుతున్నాయి.

Related Tags :

Related Posts :