లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

కరోనా వ్యాక్సిన్ తీసుకోనన్న బ్రెజిల్ అధ్యక్షుడు

Published

on

Brazil President

I’m Not Going To Take It”Brazil President : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని ప్రకటించారు. కోవిడ్‌-19ను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచి వ్యాక్సినేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం తన హక్కు అని పేర్కొన్నారు. పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను వీటిని వినియోగించబోనని తెగేసి చెప్పారు.అంతేకాకుండా బ్రెజిల్‌ దేశ ప్రజలకు సైతం వ్యాక్సిన్ల అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గతంలో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో మాస్క్‌లు అంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టం కాలేదని అభిప్రాయపడ్డారు. వైరస్‌ను మాస్క్‌లు అడ్డుకుంటున్నట్లు స్వల్ప ఆధారాలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తన పెంపుడు కుక్కకు మాత్రమే అవసరమున్నట్లు అక్టోబర్‌లో ట్విటర్‌ ద్వారా బోల్సొనారో జోక్‌ చేశారు. ఈ ట్వీట్స్‌పై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.


సాంకేతిక ఆర్థిక మాంద్యంలోకి భారత్ : Q2 GDP డేటా


ఇటు బ్రెజిల్‌లో కరోనా పరీక్షలు సక్రమంగా చేయకపోవడం, రూల్స్ పాటించకపోవడం, కఠిన చట్టాలు చేయకపోవడం వల్లే కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ మూడో స్థానంలో ఉండగా.. మరణాలు కూడా భారీగా చోటు చేసుకుంటున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *