Home » భారత్లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు, 3,967 కేసులు నమోదు
Published
8 months agoon
By
nagamaniభారత్లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు సంభవించగా.. 3,967 కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా కోరలు అంతకంతకూ పెరుగుతూ ప్రాణాలను తీసేస్తోంది. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటున్నా కరోనా కాటుకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అలా గడిచిన కేవలం 24 గంటల్లోనే కరోనా కోరలకు 100మంది బలైపోయారు.
కొత్తగా మరో 3,967 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 2,649కి చేరుకున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ 81,970కి చేరిదని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారి నుంచి 27,920 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కానీ అలాడిశ్చార్జి అయినవారు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదనీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
భారత్ లో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నమోదవుతున్నండగా వివరాలు ఇలా…
మహారాష్ట్ర -27,524 కేసులు నమోదు.1,019 మంది మృతి.
తమిళనాడు – 9,674 నమోదు (మృతులు 66)
గుజరాత్ – 9,592 నమోదు (మృతులు 586)
ఢిల్లీ – 8,470 నమోదు (మృతులు 115)
రాజస్థాన్ – 4,589 నమోదు (మృతులు 125)
మధ్యప్రదేశ్ – 4,426 నమోదు(మృతులు 237),
ఉత్తరప్రదేశ్ – 3,902 నమోదు (మృతులు 88)
వెస్ట్ బెంగాల్ – 3902 నమోదు (మృతులు 215)
ఆంధ్రప్రదేశ్ – 2,205 నమోదు(మృతులు 48)
పంజాబ్ – 1,935 నమోదు(మృతులు 32)
తెలంగాణలో 1,414 నమోదు (మృతులు 34) గా కేసులు నమోదు అయ్యాయి.
Read Here >> 3లక్షలకు చేరువలో కరోనా మరణాలు