విలువైన వస్తువులు ఇంట్లో ఒకేచోట పెట్టొద్దు, బెడ్ రూమ్‌లోకి రానివ్వొద్దు, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవద్దు.. పని మనుషుల విషయంలో హైదరాబాద్ ప్రజలకు సీపీ సజ్జనార్ జాగ్రత్తలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

cp sajjanar : కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ పారిపోతుండగా ఉత్తరప్రదేశ్ బోర్డర్ లో దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.5లక్షల నగదుతో పాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు వినోద్ సాహి, నార్జింగ్ సాహి, సీతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

నేపాలీ గ్యాంగ్ పాల్పడిన దొంగతనాల వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. అక్టోబర్ 6న రాయదుర్గంలో ఇంటి యజమానికి డిన్నర్ లో మత్తుమందు కలిపి నగదు, నగలతో నేపాలీ గ్యాంగ్ పరారైంది. ఈ ఘటన సంచలనం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నేపాలీ గ్యాంగ్ కోసం ముమ్మరంగా గాలించారు. చివరికి వారిని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పని మనుషులను తీసుకునే విషయంలో నగర ప్రజలకు సీపీ సజ్జనార్ జాగ్రత్తలు చెప్పారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎవరినైనా పనిలోకి తీసుకునే ముందు యజమానులు వారి పూర్తి వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలన్నారు. బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్నాకే పనిలోకి తీసుకోవాలన్నారు.

పనిలోకి తీసుకునే ముందు కచ్చితంగా ఎంక్వైరీ చేయండి:
మాదాపూర్ పోలీసుల బృందం నేపాల్ బోర్డర్ లో ఉండి ఆపరేషన్ చేసిందని సీపీ సజ్జనార్ తెలిపారు. మాదాపూర్ వెంకటేశ్వర్లు, ఎస్వోటీ సందీప్, ఏసీపీ రఘునందన్, ఇన్ స్పెక్టర్ రవీందర్, ఇన్ స్పెక్టర్ బాలరాజు, ఇన్ స్పెక్టర్ సుధీర్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. రాయదుర్గం పోలీసు టీమ్ కోఆర్డినేషన్ చేసుకుని నేపాలీ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగిందన్నారు. ఇంట్లో పనిమనిషిగా పెట్టుకునేముందు వారి వివరాలూ పూర్తిగా తెలుసుకోవాలని నగర ప్రజలకు పోలీసులు సూచించారు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని చేశాడు అనే వివరాలు తెలుసుకోవాలన్నారు.

బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోకుండా గుడ్డిగా పనిలోకి తీసుకోవద్దు:
కచ్చితంగా వారి బ్యాక్ గ్రౌండ్ గురించి వెరిఫై చేసుకోవాలన్నారు. ఎలాంటి వెరిఫై చేసుకోకుండా మా స్నేహితుడు చెప్పాడని, బంధువు చెప్పాడని పనిలో చేర్చుకోవద్దని పోలీసులు కోరారు. గతంలో వారు ఎక్కడ పని చేశారో తెలుసుకుని, ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడాలన్నారు. ఆ వ్యక్తి ప్రవర్తన, తీరు గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు. బ్యాక్ గ్రౌండ్ చెక్ అన్నది చాలా ముఖ్యం అని సీపీ చెప్పారు. ఎవరో రెఫరెన్స్ ఇచ్చారని, ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా నేరుగా పనిలోకి తీసుకోవద్దని సీపీ కోరారు. ఎవరినైనా పనిలోకి తీసుకునే ముందు ఆ వ్యక్తితో పర్సనల్ గా మాట్లాడాలని, వారి బాడీ లాంగ్వేజ్ ని స్టడీ చేయాలని, ఇంటర్వ్యూ చేయాలని సీపీ సూచించారు. ఇవన్నీ చేశాకే ఆ వ్యక్తిని పనిలోకి తీసుకోవాలని నగర ప్రజలకు సీపీ కోరారు.

READ  కన్నీటి వీడ్కోలు : మహాప్రస్థానంలో సత్యనాదెళ్ల తండ్రి అంత్యక్రియలు

విలువైన వస్తువులు ఇంట్లో ఒకేచోట పెట్టొద్దు, బెడ్ రూమ్ లోకి రానివ్వొద్దు:
ఇంట్లో ఆ వ్యక్తి పని చేస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు? ఆ వ్యక్తి రాత్రి వేళ ఎక్కడికైనా వెళ్తున్నాడా? ఏ టైమ్ కి వస్తున్నాడు? ఏ టైమ్ కి వెళ్తున్నాడు? మధ్యలో ఏవైనా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడా? ఇలా ప్రతి విషయాన్ని యజమానులు కచ్చితంగా వాచ్ చేయాల్సిందేనని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. దయచేసి పని మనుషుల మీద మరీ ఎక్కువగా ఆధారపడొద్దని నగర ప్రజలను సీపీ కోరారు. ఇంట్లోని ప్రతి గదిలోకి పని మనుషులను ఎంటర్ కానివ్వకూడదన్నారు. ఎక్కడెక్కడ విలువైన వస్తువులు పెట్టారో పని మనుషులకు తెలియకుండా ఉండాలన్నారు. పర్యవేక్షణ లేకుండా పని చేసేందుకు పని వాళ్లను వదలొద్దు అన్నారు. నిరంతరం పని మనుషులపై నిఘా ఉండాలన్నారు.

ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దు:
బెడ్ రూమ్ లోకి, విలువైన వస్తువులు పెట్టిన గదుల్లోకి పని మనుషులను పంపే సమయంలో వారిపై నిఘా పెట్టాల్సిందే అన్నారు సీపీ సజ్జనార్. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టిన చోటు యజమానికి తప్ప మరో వ్యక్తికి తెలియకూడదన్నారు. ఎక్కడ పడితే అక్కడ కీ పడేయకూడదన్నారు. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా వాటిని బ్యాంకు లాకర్ లో పెట్టుకోవాలని సీపీ సూచించారు.

ఏదైనా వెకేషన్ కు లేదా ఫంక్షన్ కి వెళ్లేది ఉంటే… దాని గురించి అందరికి ప్రచారం చేసుకోవద్దు అన్నారు. ఆ వివరాలు సోషల్ మీడియాలో పెట్టొద్దు అని కోరారు. ఇలాంటి వాటి వల్లే నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు సీపీ. పని మనుషులపై పర్యవేక్షణ లేకపోవడం కూడా నేరాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగేందుకు దారి తీస్తోందన్నారు. తప్పని పరిస్థితుల్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వస్తే కచ్చితంగా వారి బ్యాక్ గ్రౌండ్ గురించి వెరిఫై చేయాలని సీపీ కోరారు. అలాగే ఏదైనా సందేహం వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు. కచ్చితంగా పోలీసులు హెల్ప్ చేస్తారని చెప్పారు.

ఇప్పుడు పట్టుబడిన దొంగలు గతంలో ఇలానే పని మనుషుల్లా చేరి చోరీలకు పాల్పడ్డారని సీపీ తెలిపారు. వారి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోకుండా పనిలోకి తీసుకోవడం వల్ల మళ్లీ మళ్లీ చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజలు ఇలాంటి గ్యాంగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు.

Related Posts